Eswara Rao : సీనియర్‌ నటుడు ఈశ్వరరావు కన్నుమూత

మిచిగాన్‌లోని తన కూతురు ఇంటికి వెళ్లిన ఈశ్వరరావు అనారోగ్య సమస్యల కారణంగా గత అక్టోబర్‌ 31న తుదిశ్వాస విడిచారు

Published By: HashtagU Telugu Desk
Tollywood Actor Eswar Rao P

Tollywood Actor Eswar Rao P

తెలుగు చిత్రసీమ (Tollywood)లో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు ఈశ్వరరావు (Eswar Rao Passed Away) తుదిశ్వాస విడిచారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మిచిగాన్‌ (higan In US)లోని తన కూతురు ఇంటికి వెళ్లిన ఈశ్వరరావు అనారోగ్య సమస్యల (Health Issues) కారణంగా గత అక్టోబర్‌ 31న తుదిశ్వాస విడిచారు.

We’re now on WhatsApp. Click to Join.

దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ‘స్వర్గం నరకం’ చిత్రం ద్వారా ఈశ్వరరావు సినీరంగ ప్రవేశం చేశారు. తొలి సినిమాతోనే హిట్‌ అందుకున్న ఆయన కాంస్య నంది అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత దేవతలారా దీవించండి, ప్రేమాభిషేకం, యుగపురుషుడు, దయామయుడు, ఘరానా మొగుడు, ప్రెసిడెంట్‌గారి అబ్బాయి, జయం మనదే, శభాష్‌ గోపి వంటి విజయవంతమైన చిత్రాల్లో ఈశ్వరరావు నటించారు. చివరిసారిగా చిరంజీవి, నగ్మా నటించిన ఘరానా మొగుడు చిత్రంలో కనిపించారు. తన కెరీర్‌లో దాదాపు 200కు పైగా చిత్రాల్లో ఈశ్వరరావు నటించారు. ఈశ్వరరావు మృతి వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులంతా సంతాపాన్ని తెలిపారు.

Read Also : CM Jagan : సుప్రీం కోర్ట్ లో జగన్ కు ఎదురుదెబ్బ ..

  Last Updated: 03 Nov 2023, 01:11 PM IST