Site icon HashtagU Telugu

Nag-Naresh Multistarrer: టాలీవుడ్ లో మరో మల్టీస్టారర్.. నాగ్ తో అల్లరి నరేష్ మూవీ!

Nag And Naresh

Nag And Naresh

టాలీవుడ్  (Tollywood)లో మల్టీస్టారర్ మూవీస్ హవా కొనసాగుతోంది. పెద్ద హీరోలు ఒకే సినిమాలో పోటాపోటీగా నటిస్తూ ఎంటర్ టైన్ చేస్తూ కిక్ ఇస్తుండటంతో అభిమానులు కూడా మల్టీస్టారర్ల (multistarrer) మూవీస్ పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో వచ్చిన భీమ్లానాయక్,  ఎన్టీఆర్, రాంచరణ్ నటించిన ఆర్ఆర్ఆర్, చిరంజీవి, రవితేజ కలిసిన నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలు సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మల్టీస్టారర్ల (multistarrer) సినిమాలు దూసుకుపోతుండటంతో తెలుగులో మరిన్ని మల్టీస్టారర్లు రాబోతున్నాయి.

తాజాగా మరోసారి కొత్త మల్టీస్టారర్ కు రంగం సిద్ధమైంది. సీనియర్ హీరో నాగార్జున, యంగ్ హీరో అల్లరి నరేష్ (Allari Naresh) కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమా ద్వారా ప్రముఖ రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ దర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. రచయితగా వరుస విజయాలు అందుకున్న ప్రసన్నకుమార్ నాగార్జున కోసం పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో కథను సిద్ధం చేశారు. నాగార్జున కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కించనున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ది ఘోస్ట్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న నాగార్జున (Nagarjuna) ఈ సినిమాను వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభించి ఫాస్ట్ గా ఫినిష్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మూవీని శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్నారు. కాగా ఈ సినిమాలో నటించే హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులకు సంబంధించిన వివరాలు అతి త్వరలో ప్రకటించనున్నారు. అయితే సినియర్ హీరో నాగార్జునకు మల్టీస్టారర్ (multistarrer) మూవీ చేయడం కొత్తేమీ కాదు. మోహన్ బాబు, నాని లాంటి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

Also Read: Lord Shiva: శివునికి అభిషేకం చేయిస్తే చాలు.. అన్నీ శుభఫలితాలే!

Exit mobile version