మహా కుంభమేళా (Maha Kumbh Mela 2025) ఆధ్యాత్మికతతో ప్రయాగ్ రాజ్ భక్తులతో సందడి గా మారింది. గంగా నది పరివాహక ప్రాంతం శివనామస్మరణతో మార్మోగిపోతోంది. నాగ సాధువులు, అఘోరాలు, సన్యాసులు అక్కడికి వచ్చే భక్తులతో కలసి ఆధ్యాత్మిక శోభను మరింత పెంచుతున్నారు. ఈ పవిత్ర క్షేత్రంలో భక్తుల మధ్య టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ (Brahmaji) సందడి చేయడం విశేషంగా నిలిచింది.
Padma Vibhushan : డాక్టర్ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి బ్యాక్ గ్రౌండ్ ఇదే..
టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా పేరు పొందిన బ్రహ్మాజీ తన కుటుంబంతో కలిసి మహా కుంభమేళాకు హాజరయ్యారు. భార్యతో కలిసి గంగా నదిలో పుణ్యస్నానం చేసి ఆధ్యాత్మికతను అనుభవించారు. అనంతరం అక్కడున్న నాగ సాధువులతో ముచ్చటించి, సెల్ఫీలు తీసుకుని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. బ్రహ్మాజీని ఈ విధంగా చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. బ్రహ్మాజీ ఆధ్యాత్మిక భావనలను చాలామంది ప్రశంసిస్తున్నారు. హీరోగా , విలన్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తుంటాడు.
అలాగే విద్యావంతులు, సంపన్నులు, సినీ ప్రముఖులు ఇలా అనేక మంది తమ పనులను వదిలి ఈ ఆధ్యాత్మిక వేడుకకు తరలివస్తున్నారు. ప్రముఖ సినీ నటి మమతా కులకర్ణి వంటి ప్రముఖులు కూడా ఈ వేడుకలో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ మహా కుంభమేళా వంటి వేడుకలు భారతీయ సంస్కృతికి ప్రతీకలు. భక్తుల ఆధ్యాత్మిక భావనలకు ప్రాధాన్యమిచ్చే ఈ వేడుకల ద్వారా మనం ధార్మికత, ఆత్మశుద్ధిని పొందగలుగుతాము అని అంత భావిస్తుంటారు.