Rajamouli: దర్శకధీరుడికి అరుదైన గౌరవం, రాజమౌళికి న్యూయార్క్ ఫిలీం క్రిటిక్స్ అవార్డు

టాలీవుడ్ దర్శకదీరుడు రాజమౌళికి మరో గౌరవం దక్కింది.

  • Written By:
  • Updated On - December 3, 2022 / 03:22 PM IST

టాలీవుడ్ దర్శకదీరుడు రాజమౌళికి మరో గౌరవం దక్కింది. తాజాగా న్యూ యార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డుల్లో ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి ఎంపిక కావడం ఆయనకు మరో మైలురాయి. ఇంకే ఇండియన్ మేకర్ కి ఈ గౌరవం దక్కలేదు. ఈ కమిటీ సభ్యులు ఎన్నో అంశాలను కాచి వడపోసిన తర్వాతే బెస్ట్ డైరెక్టర్ ని గుర్తిస్తారు. ఆర్ఆర్ఆర్ ప్రభంజనంతో పాటు అమెరికా తదితర దేశాల్లో ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన, మీడియా ఇచ్చిన రివ్యూ, అందులో ఎమోషన్లకు యాక్షన్ కంటెంట్ కు కనెక్ట్ అయిన తీరు వీటన్నిటికి కూలంకుషంగా అధ్యయనం చేశాకే ఫైనల్ చేశారు.

దీన్ని అందుకోవడానికి రాజమౌళి మరోసారి యుఎస్ వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడీ ఘనత అవార్డు ఆస్కార్ కు వెళ్లే దారిలో కీలక మలుపనే చెప్పాలి. మన దేశం నుంచి అఫీషియల్ గా వెళ్లలేకపోయిన ఆర్ఆర్ఆర్ జనరల్ క్యాటగిరీలో నామినేషన్లు వేసింది. గుజరాతి చిత్రం లాస్ట్ ఫిలింని ఓవర్ టేక్ చేసి అకాడమీ పురస్కారం అందుకోవడం ద్వారా ఇక్కడి కమిటీ తప్పేంటో ఎత్తి చూపించే ఛాన్స్ కూడా దీని ద్వారా కలుగుతుంది.

అందుకే పట్టు వదలకుండా ఇలాగే కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ ఫారినర్స్ నుంచి ఆర్ఆర్ఆర్ ప్రశంసిస్తూ ట్వీట్లు కొనసాగుతూనే ఉన్నాయి. రాజమౌళికి అవార్డు రావడం పట్ల టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్ అనిపించుకున్న జక్కన్న త్వరలో మహేశ్ బాబుతో మూవీని ప్లాన్ చేస్తున్నాడు.