Tollywood : ఇండస్ట్రీ లో ఛాన్సులు రావాలంటే దర్శక – నిర్మాతల కోరిక తీర్చాల్సిందే – రమ్యకృష్ణ

ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదగాలంటే కచ్చితంగా దర్శక-నిర్మాతలు లేదా హీరోల కోరిక తీర్చాల్సిందే అని తేల్చి చెప్పింది. వారి పడకగదిలోకి వెళ్లాల్సిందే..అని అప్పుడే ఛాన్సులు వస్తాయని తెలిపి షాక్ ఇచ్చింది

Published By: HashtagU Telugu Desk
Ramya Krishnan Casting Coun

Ramya Krishnan Casting Coun

చిత్రసీమ(Film Industry)లో కాస్టింగ్ కౌచ్‌ అనేది కామన్..ఇది ఈరోజు నుండి వస్తుంది కాదు..ఎప్పటి నుండో కొనసాగుతున్నదే..కాకపోతే ఈ మధ్య దీనిగురించి హీరోయిన్లు నోరు విప్పుతూ వస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది తమకు ఎదురైనా సంఘటనలు తెలుపుతూ షాక్ కు గురి చేస్తున్నారు. తాజాగా సీనియర్ నటి రమ్యకృష్ణ (Ramyakrishna) సైతం కాస్టింగ్ కౌచ్‌ ఫై కీలక వ్యాఖ్యలు చేసారు.

ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదగాలంటే కచ్చితంగా దర్శక-నిర్మాతలు లేదా హీరోల కోరిక తీర్చాల్సిందే అని తేల్చి చెప్పింది. వారి పడకగదిలోకి వెళ్లాల్సిందే..అని అప్పుడే ఛాన్సులు వస్తాయని తెలిపి షాక్ ఇచ్చింది. అయితే అందరూ అలా ఉంటారని కాదు కానీ, హీరోయిన్ కావాలంటే మాత్రం ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ అవ్వక తప్పదని రమ్యకృష్ణ తెలిపింది. ఎక్కడో ఒక చోటు మగవాళ్లకు లొంగిపోవాల్సిందే అని.. ఒకవేళ అలా చేయకపోతే కెరీర్ ముందుకు సాగదని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదని చెప్పుకొచ్చింది. అందుకే కొన్ని కొన్ని సార్లు కొంతమంది దగ్గర లొంగి పోవాల్సి వస్తుంది అంటూ రమ్యకృష్ణ తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1990ల్లో స్టార్ హీరోయిన్‌గా రమ్యకృష్ణ ఓ వెలుగు వెలిగారు. అగ్ర హీరోలందరితో నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. ఆ రోజుల్లోనే బికిని ధరించి రమ్యకృష్ణ పెద్ద సంచలనమే సృష్టించింది. తెలుగు సినిమాలలో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. రెండో ఇన్నింగ్స్‌లో బాహుబలి సినిమాలో తల్లిగా నటించి అంతర్జాతీయ స్టార్‌గా ఎదిగారు. తల్లి క్యారెక్టర్‌లో ఎవరు బాగా చేస్తారు అంటే ఠక్కుమని గుర్తు వచ్చేలా బాహుబలితో పాటు లైగర్ సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. విలన్ పాత్రలో నటించాలంటే మహిళ నటులలో ఆమె ముందు వరసలో ఉంటారు. అలాంటి ఈమె తాజాగా కాస్టింగ్ కౌచ్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

Read Also : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ బర్త్ డేకి.. రెడీ అవుతున్న బహుమతులు..

  Last Updated: 05 May 2024, 01:27 PM IST