Walther Veeraiah: ఈ రోజే ఓటీటీలోకి వాల్తేరు వీరయ్య..

మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ మూవీ వాల్తేరు వీరయ్య ఓటీటీలోకి వచ్చేసింది.

మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ మూవీ వాల్తేరు వీరయ్య (Walther Veeraiah) ఓటీటీలోకి వచ్చేసింది. దీంతో ఇప్పటికే థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేసిన ఆడియన్స్ తో పాటు ఇప్పటిదాకా సినిమా చూడని వారంతా ఇంట్లోనే ఎంజాయ్ చేస్తున్నారు. వాల్తేరు వీరయ్య రాక ప్రతి ఇంట్లో పూనకాలు లోడ్ చేస్తోంది. థియేటర్లలో వాల్తేరు వీరయ్య ఊచకోత నడుస్తుండగానే వాల్తేరు వీరయ్య ఓటీటీ (OTT) రిలీజ్ డేట్ లాక్ చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో స్ట్రీమింగ్‌కి రెడీ అయ్యాడు వాల్తేరు వీరయ్య. ఈ రోజు (ఫిబ్రవరి 27) అర్దరాత్రి నుంచే ప్రముఖ ఓటీటీ (OTT) వేదిక నెట్ ఫ్లిక్స్ (Netflix) లో వాల్తేరు వీరయ్య స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఈ మెగా మాస్ జాతర కోసం జనం రెడీ అవుతున్నారు. మెగాస్టార్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను ఇంట్లోనే ఫ్యామిలీ అంతా కూర్చొని ఎంజాయ్ చేయడానికి ప్లాన్స్ చేసుకుంటున్నారు.

రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే మాస్ యాక్షన్ మూవీ వాల్తేరు వీరయ్యతో రంగంలోకి దిగి సక్సెస్ సాధించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన ఈ సినిమా భారీ సక్సెస్ సాధించింది. అన్ని ఏరియాల్లో కూడా బాక్సాఫీస్ వద్ద వాల్తేరు వీరయ్య ఊచకోత నడిచింది. 250 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంక్రాంతి విన్నర్ అయ్యారు చిరంజీవి. ఓవర్సీస్‌ లోనూ 2.5 మిలియన్ డాలర్లను కొల్లగొట్టి సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాడు వాల్తేరు వీరయ్య (Walther Veeraiah). బాబీ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ మెగా అభిమానులకు కిక్కిచ్చింది. రవితేజ పోషించిన రోల్ స్పెషల్ అట్రాక్షన్ అయింది.

ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పర్ఫెక్ట్ అవుట్ పుట్ తో రంగంలోకి దిగిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు రవితేజ కూడా తన మార్క్ చూపించారు. చిరంజీవి- రవితేజ నడుమ షూట్ చేసిన కొన్ని సీన్స్ సినిమాలో మేజర్ హైలైట్ అయ్యాయి. మెగా మాస్ ట్రీట్ తో ఈ సినిమాను సూపర్ డూపర్ హిట్ చేసేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా విజయం పట్ల చిత్ర యూనిట్ ఖుషీ అయింది. భారీ రేంజ్ లో సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. సో.. చూడాలిమరి థియేటర్లలో రికార్డుల సునామీ సృష్టించిన వాల్తేరు వీరయ్య ఓటీటీలో ఏ రేంజ్ వ్యూస్ రాబడుతారనేది!.

Also Read:  TTD Alert: నేటి నుంచి ఆన్ లైన్ లో అకామిడేషన్ బుకింగ్.. ఇలా బుక్ చేసుకోండి