Tanikella Bharani : ఇవాళ ప్రముఖ సీనియర్ నటుడు తనికెళ్ల భరణి బర్త్‌డే. ఆయన 1956 జులై 14న పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారు. ఈరోజు 68వ పుట్టినరోజును జరుపుకుంటున్న తనికెళ్ల భరణి ఇప్పటివరకు 200కుపైగా సినిమాల్లో నటించారు. తన కెరీర్‌లోని ఆసక్తికర, కీలకమైన అంశాల గురించి స్వయంగా తనికెళ్ల భరణి పలు ఇంటర్వ్యూల్లో వివరించారు. ఆ వివరాలను ఈసందర్భంగా మనం కూడా తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
- తాను చిన్నతనంలో ఎంతో అల్లరి చేసేవాడినని నటుడు తనికెళ్ల భరణి(Tanikella Bharani) చెబుతుంటారు.‘‘చిన్నతనంలో చాలా అల్లరి చేశాను. నేను బ్యాడ్ స్టూడెంట్‌ను. నా గోల తట్టుకోలేక మా నాన్న నన్ను చెట్టుకు కట్టేసి కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి’’ అని ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
- తనకు ఇప్పటికీ డబ్బులు లెక్కపెట్టడం రాదని తనికెళ్ల భరణి అంటారు.
- ‘‘అన్ని పరిస్థితులకు సర్దుకుపోగలిగే వాళ్లే సినిమా రంగంలో రాణిస్తారు. ఒక్కోసారి లగ్జరీ హోటల్లో ఉండాల్సి వస్తుంది. కొన్నిసార్లు శ్మశానం పక్కన అన్నం తినాల్సి వస్తుంది. అయినా రెడీ అయిపోవాలి. అన్ని సందర్భాల్లో ఒకేలా ఉండాలి’’ అని తనికెళ్ల భరణి చెబుతారు.
- ‘‘నేను పూజలు మానేసి 15 ఏళ్లు అవుతోంది. సమయం దొరికినప్పుడల్లా ధ్యానం చేస్తుంటాను. చేస్తున్న పనిలో వందశాతం మనసును నిమగ్నం చేయడం కూడా నా దృష్టిలో ధ్యానమే’’ అని తనికెళ్ల భరణి చెబుతారు.
Also Read :Weather Forecast : ఈనెల 18 వరకు వర్షాలు.. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన
- ‘‘కష్టంలో ఉన్నవారికి సాయం చేయడమే పుణ్యం. మరొకరిని మానసికంగా బాధ పెట్టడమే పాపం’’ అని ఆయన అంటారు.
- ‘‘ప్రతి ఒక్కరూ మరణం గురించి ఆలోచించి తీరాలి. ఎప్పుడు ప్రయాణం చేస్తున్నా నేను దాని గురించే ఆలోచిస్తాను. ఎన్ని రోజులు బతికామన్నది ముఖ్యం కాదు. ఉన్నన్ని రోజులు ఎంత ఆనందంగా ఉన్నామనేది ముఖ్యం’’ అని తనికెళ్ల భరణి చెబుతారు.
- ఇటీవల ఓ యూట్యూబర్‌కు తనికెళ్ల భరణి ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘మీకు టీనేజ్‌లో లవ్, క్రష్ లాంటివి ఏమైనా ఉన్నాయా?’’ అని యూట్యూబర్ ప్రశ్నించగా.. ‘‘ప్రతివాడికీ ఉంటాయి.. అలాగే నాకు కూడా ఉంది. టీనేజీ టైంలో మా కాలనీలోకి కొత్తగా వచ్చిన అమ్మాయితో ప్రేమ కథ నడిచింది’’ అని ఆయన బదులిచ్చారు.
- ప్రముఖ దర్శకుడు వంశీ(Tollywood) తనకు మంచి స్నేహితుడని తనికెళ్ల భరణి తెలిపారు.
- సొగసు చూడతరమా, ఎగిరేపావురమా, మావిచిగురు, పరదేశి సినిమాలలో భరణి తన నట విశ్వరూపంతో ఆకట్టుకున్నారు. కామెడీ,విలన్, వైవిధ్యమైన పాత్రలను పోషించి ఆయన ప్రజాదరణ పొందారు.