Jr.NTR and Kalyan Ram: నేడు ఎన్టీఆర్ వర్ధంతి.. జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళి

జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌లు ఎన్టీఆర్ ఘాట్‌ వద్ద తారక రామారావు నివాళులు అర్పించారు.

  • Written By:
  • Updated On - January 18, 2023 / 12:43 PM IST

తెలుగుదేశం (TDP) పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు (NT Ramarao) 27వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు నివాళులర్పించారు. బుధవారం తెల్లవారుజామునే జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌లు ఎన్టీఆర్ ఘాట్‌ వద్దకు చేరుకున్నారు. ఎన్టీఆర్‌ సమాధి వద్దకు వచ్చిన ఇద్దరు సోదరులు పుష్పగుచ్ఛాలు ఉంచి తమ తాతను (NT Ramarao) స్మరించుకున్నారు. ‘‘ఆ మహనీయులు నందమూరి తారకరామారావుగారు (NT Ramarao) మన మధ్య భౌతికంగా లేకపోయినప్పటికీ వారి అంశలో పుట్టిన జూనియర్ నందమూరి తారకరాముడు మన మధ్య ఉన్నాడు. ఆయన ఆశయాలను ముందుకు కొనసాగించడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటాడు’’ అంటూ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో ప్రత్యేక నివాళి అర్పిస్తున్నారు.

గుంటూరులో ఉచిత ఆరోగ్య రథం

రామరావు వర్ధంతి సందర్భంగా ఇవాళ గుంటూరులో (Guntur) ఉచిత ఆరోగ్య రథం ప్రారంభించారు. ఎన్ఆర్ఐ ఉయ్యురు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పేద ప్రజలకోసం ఉచిత వైద్యం అందించడానికి ఎన్టీఆర్ ఆరోగ్య రథం (Health Vechile) పేరుతో నూతన వాహనం అందుబాటులోకి వచ్చింది. వైద్యసేవలు, డాక్టర్ తో వైద్య సంప్రదింపులు, ఉచిత మందులు, 200లకుపైగా వ్యాధి నిర్ధారణా పరీక్షలు, ఈ సీ జి, నెబులైజర్,ఆక్సీజన్ సిలిండర్, మాత శిశు సంరక్షణ, ఆరోగ్య నిపుణులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని టీడీపీ శ్రేణులు తెలిపారు. ఇక ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ నాయకులు (Tdp Leaders), కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Also Read: CBN Power : అధికార మార్పుపై అంచ‌నా, చంద్ర‌బాబుతో IAS,IPSల ర‌హ‌స్య‌ భేటీ