Tillu Square Release Trailer సిద్ధు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు బ్లాక్ బస్టర్ హిట్ అందుకోగా ఈ సినిమా సీక్వల్ గా టిల్లు స్క్వేర్ సినిమా తెరకెక్కించారు. మల్లిక్ రామ్ డైరెక్షన్ లో వస్తున్న టిల్లు స్క్వేర్ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రచార చిత్రాలు అదరగొట్టగా రిలీజ్ కేవలం 3 రోజులే ఉండగా సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. అయితే టిల్లు స్క్వేర్ సినిమా ట్రైలర్ ఎప్పుడో లాస్ట్ మంత్ రిలీజ్ చేశారు.
ఆ ట్రైలర్ తోనే సినిమాపై సూపర్ బజ్ ఏర్పరిచారు. అయితే రిలీజ్ ముందు మరో ట్రైలర్ రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు మేకర్స్. రిలీజ్ ట్రైలర్ కూడా అదిరిపోతుందని. సినిమా మీద మరింత అంచనాలు పెంచేలా ఈ ట్రైలర్ వస్తుందని తెలుస్తుంది. టిల్లు స్క్వేర్ రిలీజ్ ట్రైలర్ బుధవారం రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.
ఈ ట్రైలర్ కూడా యూత్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకునే వదులుతున్నారని తెలుస్తుంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన టిల్లు స్క్వేర్ సినిమా అమ్మడి గ్లామర్ ట్రీట్ తో అదరగొడుతుందని అంటున్నారు.
Also Read : Vijay Devarakonda : ఇప్పటికీ అడ్జస్ట్ అవుతా.. విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!