Ravi Teja: రవితేజ టైగర్ నాగేశ్వర రావు మేకింగ్ వీడియో చూశారా

టైగర్ నాగేశ్వరరావు సినిమా ఎట్టకేలకు మరో 4 రోజుల్లో అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published By: HashtagU Telugu Desk
Tiger Nagesh

Tiger Nagesh

Ravi Teja: దర్శకుడు వంశీ ఐదేళ్ల కల అయిన టైగర్ నాగేశ్వరరావు సినిమా ఎట్టకేలకు మరో 4 రోజుల్లో అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. మేకింగ్ వీడియోలో టైగర్ నాగేశ్వరరావు జర్నీని చూపించారు. రవితేజ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌లో ఎక్కువ భాగం 3 భారీ సెట్లలో జరిగింది. ఇది 365 రోజుల పాటు బృందం చేసిన సమిష్టి కృషి ఇది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో యాక్షన్ సీన్స్ ఆకట్టుకున్నాయి.

టైగర్ నాగేశ్వరరావు పాత్రను పోషించడానికి రవితేజ ముఖ్యంగా యాక్షన్ బ్లాక్‌లలో తన బెస్ట్ ఇచ్చాడు. సినిమాలో డీప్ ఎమోషన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కథానాయకుడిని ఎలివేట్ చేయాలనే దర్శకుడు వంశీ దృష్టి మేకింగ్ వీడియోలోనే కనిపిస్తుంది. నిర్మాత అభిషేక్ అగర్వాల్ రాజీపడని మేకింగ్ కూడా వీడియోలోచూడొచ్చు. రవితేజకు  టైగర్ నాగేశ్వరరావు మొదటి పాన్ ఇండియా మూవీ. మరి ఈ సినిమాను ఇతర భాషల ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

Also Read: BRS Minister: ఎన్నికల ప్రచార పర్వం మొదలుపెట్టిన మంత్రి మహేందర్ రెడ్డి

  Last Updated: 16 Oct 2023, 08:31 PM IST