Tiger Nageswara Rao : ‘టైగర్‌ నాగేశ్వర రావు’ సెన్సార్ టాక్

సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ జారీచేశారు. అలాగే ఈ సినిమా రన్ టైమ్ ను 3 గంటల 2 నిమిషాలుగా ఫిక్స్ చేసింది. అయితే ఈ ఏడాది అత్యధిక నిడివి ఉన్న సినిమాగా.. టైగర్ నాగేశ్వర రావు రికార్డు క్రియేట్ చేసింది

  • Written By:
  • Publish Date - October 12, 2023 / 03:48 PM IST

మాస్ రాజా రవితేజ (Raviteja)..ప్రస్తుతం హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఓ సినిమా సెట్స్ ఫై ఉండగానే మరో రెండు సినిమాలను లైన్లో పెడుతూ వస్తున్నాడు. రీసెంట్ గా ధమాకా (Dhamaka),వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న రవితేజ..ఆ తర్వాత రావణాసుర (Ravanasuraa) తో భారీ డిజాస్టర్ అందుకున్నాడు. అయినప్పటికీ రవితేజ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.

తాజాగా వంశీ (Vamsee) డైరెక్షన్లో టైగర్‌ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao) మూవీ చేసాడు. 1970 కాలంలో స్టూవర్ట్‌పురం (stuartpuram )లో పాపులర్‌ దొంగగా పేరు గాంచిన టైగర్ నాగేశ్వర్‌ రావు (Tiger nageswara rao) జీవిత కథ నేపథ్యంలో పాన్ ఇండియా కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రంతో బాలీవుడ్ భామ కృతిసనన్ సోదరి నుపుర్‌ సనన్‌ టాలీవుడ్‌ డెబ్యూ ఇస్తోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ దర్శకనిర్మాత, నటుడు అనుపమ్‌ ఖేర్ (Anupam Kher) ‌, మురళీ శర్మ, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దసరా సందర్బంగా అక్టోబర్ 20న పాన్ ఇండియా గా పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో మేకర్స్ ఈరోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

సినిమాను చూసిన సెన్సార్ యూనిట్..సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ జారీచేశారు. అలాగే ఈ సినిమా రన్ టైమ్ ను 3 గంటల 2 నిమిషాలుగా ఫిక్స్ చేసింది. అయితే ఈ ఏడాది అత్యధిక నిడివి ఉన్న సినిమాగా.. టైగర్ నాగేశ్వర రావు రికార్డు క్రియేట్ చేసింది. ఇంత ఎక్కున రన్ టైమ్ ఉన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం చాలా అరుదు. సినిమా రన్ టైం ఎక్కువగా ఉన్నప్పటికీ సినిమా చాలా బాగా వచ్చిందని , అన్నీ సీన్లు అద్భుతంగా ఉన్నాయని సెన్సార్ బృందం చెప్పినట్లు తెలుస్తుంది. కాస్త సాంగ్స్ విషయంలో డిస్పాయింట్ అయినట్లు తెలుస్తుంది. రవితేజ ఎప్పటిలాగానే తన ఎనర్జటిక్ యాక్టింగ్ తో కిక్ ఇచ్చాడని , చాల ఏళ్ల తర్వాత రేణు దేశాయ్ స్క్రీన్ ఫై కనిపించిందని హేమలత రోల్ లో చాల బాగా చేసిందని , సారా పాత్రలో నుపుర్‌ సనన్‌ పర్వాలేదని , తన గ్లామర్ యూత్ కు కిక్ ఇస్తుందని చెప్పినట్లు తెలుస్తుంది. ఓవరాల్ గా సినిమాకు సెన్సార్ నుండి పాజిటివ్ టాక్ వచ్చినట్లు యూనిట్ వర్గాలు చెపుతున్నారు. మరి ప్రేక్షకులు ఏమంటారో చూడాలి.

Read Also : Telugu States: తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనవంతులు వీరే