కోలీవుడ్ లెజెండ్ కమల్ హాసన్ (kamal Hasan) మరియు దర్శక దిగ్గజం మణి రత్నం (Mani Ratnam) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘థగ్ లైఫ్’ (Thug Life) ట్రైలర్ ఇటీవల విడుదలై సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. ట్రైలర్‌లో అద్భుతమైన విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నా, కమల్ హాసన్ – అభిరామి లిప్ లాక్ సీన్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 70 ఏళ్ల వయసులో కమల్ యువ కథానాయికలతో రొమాన్స్ చేయడం పై నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Kumki Elephant: మే 21న విధానసౌధలో ఏపీకి కుంకి ఏనుగుల హస్తాంతరణ
త్రిషా, అభిరామిలతో ఉన్న రొమాంటిక్ సన్నివేశాలపై కొంతమంది నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా 30 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉన్న అభిరామితో కమల్ లిప్ లాక్ సీన్ చేయడం పై “ఈ వయసులో అవసరమా ఇలాంటి సన్నివేశాలు?” అంటూ ట్రోలింగ్ మొదలైంది. ట్రైలర్‌లో ఉన్న ఈ సన్నివేశాలు కొందరికి అభ్యంతరంగా అనిపించగా, కమల్ హాసన్ వయసును దృష్టిలో ఉంచుకుని మర్యాద పరంగా ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.
అయితే మరికొంతమంది ప్రేక్షకులు మాత్రం ఇది కథ డిమాండ్ నేపథ్యం ప్రకారం అవసరమైన సన్నివేశం అని అభిప్రాయపడుతున్నారు. “ఇది సినిమా, పాత్రల డిమాండ్ మేరకు ఉండే సన్నివేశాలు తప్ప వ్యక్తిగత విషయమేమీ కాదు” అని సమర్థిస్తున్నారు. 1987లో వచ్చిన ‘నాయకన్’ తర్వాత 30 ఏళ్లకు మణిరత్నం – కమల్ హాసన్ కాంబో మళ్లీ తెరపైకి రావడం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. ‘థగ్ లైఫ్’ చిత్రంలో త్రిషా, సాన్యా మల్హోత్రా, అభిరామి, సిలంబరసన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూన్ 5న విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.