Prabhas Spirit సలార్ తో ఫ్యాన్స్ కి చాలా రోజుల తర్వాత మాస్ ఫీస్ట్ అందించిన ప్రభాస్ త్వరలో కల్కి తో రాబోతున్నాడు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కల్కి సినిమా హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా విషయంలో మేకర్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. కల్కి రిలీజ్ తర్వాత ప్రబహస్ సందీప్ వంగ డైరెక్షన్ లో చేయబోయే స్పిరిట్ సినిమాకు డేట్స్ ఇవ్వనున్నాడు.
స్పిరిట్ సినిమా లో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని తెలిసిందే. ఇప్పటికే కథ పూర్తి చేసిన సందీప్ వంగ త్వరలో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్స్ గా ఎవరిని తీసుకుంటాడా అని ఫ్యాన్స్ లో ఎగ్జైట్ మెంట్ మొదలైంది. స్పిరిట్ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ ముగ్గురు హీరోయిన్స్ కి ఉందని టాక్.
అంటే ముగ్గురిలో ఒకరికి అవకాశం వస్తుందని అంటున్నారు. ఇంతకీ ఎవరా ముగ్గురు అంటే రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, కీర్తి సురేష్ అని తెలుస్తుంది. ఈ ముగ్గురు భామల్లో ఒకరు ప్రభాస్ తో రొమాన్స్ చేస్తారని అంటున్నారు. ప్రభాస్ హను రాఘవపుడి కాంబోలో ఒక సినిమా రాబోతుంది. ఆ సినిమాలో మృణాల్ ఠాకూర్ నటిస్తుందని టాక్.
ఒకవేళ ఆ సినిమాలో మృణాల్ కన్ఫర్మ్ అయితే రష్మిక, కీర్తి సురేష్ ఈ ఇద్దరిలో ఒకరు స్పిరిట్ లో ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ సందీప్ వంగ యానిమల్ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించింది. మళ్లీ సందీప్ ఆమెనే రిపీట్ చేస్తాఅ లేదా కీర్తి ని తీసుకుంటాడా అన్నది తెలియాల్సి ఉంది.
Also Read : Pooja Hegde : పూజా బేబీ లవర్ అతనేనా.. కారులో అడ్డంగా బుక్కైన అమ్మడు వీడియో వైరల్..!