Pongal Box Office Race : సంక్రాంతి బరిలో మూడు సినిమాలు

Pongal Box Office Race : 2026 సంక్రాంతి సినీ అభిమానులకు మంచి కిక్ ఇవ్వబోతుంది. ఎప్పటిలాగానే ఈ సంక్రాంతికి కూడా అగ్ర హీరోలతో పాటు చిన్న హీరోల చిత్రాలు కూడా బరిలోకి దిగబోతున్నాయి

Published By: HashtagU Telugu Desk
Pongal Movies

Pongal Movies

2026 సంక్రాంతి సినీ అభిమానులకు మంచి కిక్ ఇవ్వబోతుంది. ఎప్పటిలాగానే ఈ సంక్రాంతికి కూడా అగ్ర హీరోలతో పాటు చిన్న హీరోల చిత్రాలు కూడా బరిలోకి దిగబోతున్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రాజాసాబ్’ పండుగ సీజన్‌కి సిద్ధమవుతోంది. చిత్రబృందం తాజాగా జనవరి 9, 2026న ఈ సినిమా విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రభాస్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా నిలుస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎప్పటిలాగే ప్రభాస్ తన యాక్షన్, స్టైల్‌తో మరోసారి బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేస్తాడని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

‎Cashew: డయాబెటిస్ ఉన్నవారు జీడిపప్పు తినకూడదా.. తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

‘రాజాసాబ్’ తో పాటు జనవరి 14న యువ నటుడు నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన **‘అనగనగా ఒకరాజు’ సినిమా విడుదల కానుంది. ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా కూడా సంక్రాంతికి వస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇలా మూడు విభిన్న తరహా సినిమాలు ఒకేసారి విడుదల కావడం వలన ప్రేక్షకులకు వినోదభరితమైన పండుగ కానరానుంది.

సంక్రాంతి సీజన్‌ తెలుగు సినిమా పరిశ్రమకు ఎప్పుడూ అత్యంత కీలకం. ఈ కాలంలో విడుదలయ్యే సినిమాలు కుటుంబ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన సాధిస్తాయి. ఈసారి ప్రభాస్, చిరంజీవి, నవీన్ పొలిశెట్టి అనే ముగ్గురు వేర్వేరు తరహా హీరోల సినిమాలు ఒకేసారి బరిలోకి రావడం ఆసక్తికర పోటీని సృష్టించింది. పెద్ద బడ్జెట్, భారీ అభిమాన వర్గం కారణంగా ‘రాజాసాబ్’ పై భారీ అంచనాలు ఉండగా, మెగాస్టార్‌ సినిమా కుటుంబ ప్రేక్షకులను ఆకర్షించనుంది. నవీన్ పొలిశెట్టి యూత్‌ను టార్గెట్ చేస్తూ వినోదాత్మకంగా తీసుకొస్తున్న ‘అనగనగా ఒకరాజు’ కూడా మంచి టాక్ తెచ్చుకుంటే బాక్స్ ఆఫీస్ రేసులో నిలబడే అవకాశం ఉంది. మొత్తంగా సంక్రాంతి-2026 తెలుగు సినీ ప్రేక్షకులకు నిజమైన పండుగ కానుంది.

  Last Updated: 30 Sep 2025, 10:33 AM IST