పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) ఈరోజు థియేటర్స్ లో విడుదలైంది. ఎన్నో ఏళ్లుగా సెట్స్ పై ఉన్న ఈ మూవీ పై ట్రైలర్ రిలీజ్ వరకు ఎవరికీ ఆసక్తి కానీ , అంచనాలు కానీ లేవు. ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు మొదలు అయ్యాయి. అలాగే పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం సినిమా ప్రమోషన్ చేయడం తో బజ్ ఏర్పడింది. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అంత భావించారు. కానీ ఆ అంచనాలను తారుమారు చేసాడు డైరెక్టర్ జ్యోతికృష్ణ. ఎంచుకున్న కథ బాగున్నప్పటికీ..దానిని తెరపై చూపించడం లో విఫలం అయ్యాడు.
ముఖ్యంగా అమరావతిలో ప్రత్యేకంగా వేసిన సెట్స్‌పై చిత్రీకరించిన సన్నివేశాల్లో విజువల్ ఎఫెక్ట్స్ తక్కువస్థాయిలో ఉండటంతో, కథా స్పీడ్ ను పూర్తిగా దెబ్బతీసింది. ఈ దృశ్యాల్లో గ్రాఫిక్స్ అసహజంగా అనిపించడంతో ప్రేక్షకులు కథలో నుంచి డిస్‌కనెక్ట్ అయ్యారు. అయితే సనాతన ధర్మం నేపథ్యంలో వచ్చిన ఎపిసోడ్ ఒక్కసారిగా సినిమాకు ఊపిరి పోసింది. కానీ తర్వాతి క్లైమాక్స్ చాలా సాధారణంగా సాగిపోవడం ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది.
Wife Kills Husband : కోర్ట్ , పోలీసులకు భయపడని ఆడవారు..స్కెచ్ వేసి మరి భర్తలను చంపుతున్నారు
పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు విపరీతంగా కష్టపడినట్టు విడుదలకు ముందు చెప్పిన మాటలు అభిమానుల్లో భారీ అంచనాలను కలిగించాయి. ఆయన సామాన్యంగా తన సినిమాల గురించి పబ్లిసిటీ చేయకపోయినా, ఈ చిత్రానికి ప్రత్యేకంగా ప్రోత్సాహం ఇవ్వడం విశేషం. “ఈ సినిమా కోసం బాగా నలిగిపోయాను… ఎంత పెద్ద రికార్డులు బద్దలవుతాయో చెప్పలేను” అని పవన్ అన్నారు. చివరి 18 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్ తానే డైరెక్ట్ చేశానని చెప్పిన పవన్ కళ్యాణ్ మాటలు అభిమానుల్లో హైప్ పెంచాయి. మంగళగిరిలో ఓ గోడౌన్‌లో వేసిన గ్రీన్ మ్యాట్ సెటప్‌లో కీలక సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్లను చిత్రీకరించారని పవన్ చెప్పిన మాటలు ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించాయి. కానీ, అదే గ్రాఫిక్ వర్క్ సినిమాను తీవ్ర విమర్శలకు గురిచేసింది. గ్రీన్ స్క్రీన్ వీఎఫ్‌ఎక్స్ నాణ్యత లేకపోవడంతో, వీరమల్లు సన్నివేశాలు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు బలి అయ్యాయి. కానీ సినిమా చూసిన ప్రేక్షకులలో మాత్రం క్లైమాక్స్ సినిమాకు మైనస్ గా మారింది. పవన్ ఆ యాక్షన్ జోలికి వెళ్లకాకుండా ఉంటె బాగుండేదేమో అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వీఎఫ్‌ఎక్స్ క్వాలిటీని మెరుగుపరచడానికే సినిమా వాయిదాలు పడినట్టు మేకర్స్ చెప్పిన మాటలకు వ్యతిరేకంగా, ఫైనల్ ఔట్‌పుట్‌లో మాత్రం నాణ్యత కనబడలేదు.
గ్రాఫిక్స్ విషయంలో ఈ మధ్య విమర్శల పాలైన ఆదిపురుష్, కన్నప్ప సినిమాల వీఎఫ్‌ఎక్స్ పనితనంతో పోల్చితే, వీరమల్లు వాటికంటే కూడా తక్కువనే ఫీల్‌ను ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. చివరికి ఈ సినిమాను మొదట దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించిన విషయాన్ని గుర్తుచేసుకుంటే, ఆయన పూర్తిగా డైరెక్ట్ చేసి ఉంటే సినిమాకు మరో ప్రాణం వచ్చేదన్న అభిప్రాయమే పలువురు పరిశీలకులు, అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా బలమైన కథా నేపథ్యం, పవన్ కళ్యాణ్ ప్యాషన్ ఉన్నప్పటికీ, వీఎఫ్‌ఎక్స్‌లో చూపిన అలసత్వం సినిమాను ఘోరంగా దెబ్బతీసింది.