Site icon HashtagU Telugu

Box Office : థియేటర్స్ లలో జనాలే లేరు..అయినాగానీ సక్సెస్ మీట్స్ ..అదేంటో మరి !

Box Office Theaters

Box Office Theaters

ఒకప్పుడు సినిమా సూపర్ హిట్ అయితేనే సక్సెస్ మీట్ (Success Meet) పెట్టేవారు కానీ ఇప్పుడు సినిమా ప్లాప్ అయినప్పటికీ సాయంత్రమే సక్సెస్ మీట్ పెట్టి స్వీట్స్ పంచుకుంటూ పరువు తీసుకుంటున్నారు. ప్రతి వారంలో కనీసం రెండు సినిమాలు విడుదలవుతున్నాయి. సినిమాలు విడుదలైన వెంటనే మేకర్స్ సక్సెస్ మీట్లు ఏర్పాటు చేస్తూ, ఆడియెన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చిందని గర్వంగా చెబుతున్నారు. కానీ ఈ ప్రకటనలకు విరుద్ధంగా ఉన్నది వాస్తవ పరిస్థితి. ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు, షోలు రద్దవుతున్నాయి, రెండవ షోలే తొలగించేస్తున్నారు. అయితే ఈ నిజాన్ని ఎవరూ బహిరంగంగా చెప్పడానికి ముందుకు రావడం లేదు. కానీ దర్శకుడు త్రినాధరావు నక్కిన మాత్రం నిర్మొహమాటంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు.

Pawan Kalyan : పవన్ నాకు డబ్బులిచ్చాడు..అసలు నిజం చెప్పిన డైరెక్టర్

త్రినాధ్ నక్కిన నిర్మాతగా నిర్మించిన చిత్రం చౌర్యపాఠం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయన థియేటర్ల వాస్తవ పరిస్థితిపై తన ఆవేదనను వ్యక్తం చేశారు. “ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. నేను స్వయంగా వెళ్లి చూసాను. షోలు రద్దవుతున్నాయి. సెకండ్ షోలే ఎత్తేస్తున్నారు. ఇది భయంకరమైన పరిస్థితి. స్టార్ హీరోల సినిమాలకే ప్రేక్షకులు రావడంలేదు, కొత్త వాళ్లతో సినిమా తీస్తే నిర్మాతల పరిస్థితి ఎలా ఉంటుంది?” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

త్రినాధరావు నక్కిన (Director Trinadha Rao Nakkina) “ధమాకా” సినిమాతో వంద కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన దర్శకుడు. అలాంటి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌ అయిన ఆయన ఈ స్థాయిలో నిజాలు వెల్లడించడం సినీ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. కొందరు వాస్తవాలను అంగీకరించేందుకు ఇష్టపడకపోయినా, ఇలాంటి సాహసోపేతమైన వ్యాఖ్యలు పరిశ్రమలో మార్పుకు దారితీయొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. థియేటర్ల పరిస్థితి మెరుగవ్వాలంటే కంటెంట్‌కి ప్రాధాన్యతనివ్వాల్సిన సమయం వచ్చిందని సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు.