Ram Charan: పెద్ది సినిమా ట్రైలర్ అప్‌డేట్ వచ్చేసింది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రం ట్రైలర్ అప్‌డేట్ వచ్చేసింది. మే 18న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 1960ల నాటి గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామాలో చరణ్ పవర్‌ఫుల్ రగ్గడ్ లుక్‌లో కనిపించనున్నారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ట్రైలర్‌లో ఇతర కీలక పాత్రలను పరిచయం చేస్తూ […]

Published By: HashtagU Telugu Desk
The trailer update for the movie 'Peddi' is here!

The trailer update for the movie 'Peddi' is here!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రం ట్రైలర్ అప్‌డేట్ వచ్చేసింది. మే 18న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 1960ల నాటి గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామాలో చరణ్ పవర్‌ఫుల్ రగ్గడ్ లుక్‌లో కనిపించనున్నారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ట్రైలర్‌లో ఇతర కీలక పాత్రలను పరిచయం చేస్తూ కథాంశంపై స్పష్టత ఇవ్వనున్నారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ సెట్స్ మీదికి వెళ్లినప్పటి నుంచీ విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటివరకు చిత్ర యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ లుక్స్, గ్లింప్స్, పాటలు, పహిల్వాన్ టీజర్ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేశాయి. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల జోరు పెంచిన మేకర్స్ సోమవారం అధికారికంగా ట్రైలర్ డేట్‌ను ప్రకటించారు. మే 18న ‘పెద్ది’ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు. ఇప్పటివరకు కేవలం రామ్ చరణ్‌ను మాత్రమే చూపిస్తూ వచ్చిన బుచ్చిబాబు, ఈ ట్రైలర్‌లో సినిమా అసలు కథను, అలాగే మిగతా కీలక పాత్రలను పరిచయం చేయబోతున్నారు. ట్రైలర్‌లోనే అందరి పాత్రలపై స్పష్టత ఇవ్వాలనే ఉద్దేశంతోనే దర్శకుడు ఇప్పటివరకు మిగతా నటీనటుల లుక్స్‌ను దాచిపెట్టారనే టాక్ వినిపిస్తోంది.

కొత్త పోస్టర్‌లో చరణ్ ‘రగ్గడ్’ అవతార్!
ట్రైలర్ అప్‌డేట్‌తో పాటు విడుదల చేసిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇందులో రామ్ చరణ్ 1960ల కాలం నాటి గ్రామీణ యువకుడిలా, పూర్తి రగ్గడ్ లుక్‌లో రైల్వే ట్రాక్‌పై నడుస్తూ కనిపిస్తున్నారు. చరణ్ మేకోవర్ చూస్తుంటే బుచ్చిబాబు ఈ సినిమా కోసం ఎంతటి రీసెర్చ్ చేశారో అర్థమవుతోంది. ప్రతి చిన్న డీటైలింగ్ ఆ కాలాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం జూన్ 4న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఓవర్సీస్ ప్రేక్షకులకు జూన్ 3 నుంచే ప్రీమియర్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, బొమన్ ఇరానీ, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ స్వరాలు ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఉప్పెన తో బ్లాక్‌బస్టర్ అందుకున్న బుచ్చిబాబు ఈసారి చరణ్‌తో కలిసి ఒక ఊరి ఆత్మగౌరవం, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఎలాంటి మ్యాజిక్ చేశారో చూడాలని సినీ లోకం ఆత్రుతగా ఉంది. ముఖ్యంగా 1960ల నాటి వాతావరణం, రెహమాన్ సంగీతం, చరణ్ మాస్ అప్పీల్ తోడవ్వడంతో ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నెల 18న రాబోతున్న ట్రైలర్ ఈ అంచనాలను మరిన్ని రెట్లు పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.

 

  Last Updated: 12 May 2026, 05:34 PM IST