The Sounds Of GameChanger : ది సౌండ్స్‌ ఆఫ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ వీడియో రిలీజ్

Game Changer : ఈ సినిమాలోని మ్యూజిక్‌కు సంబంధించి ది సౌండ్స్‌ ఆఫ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ పేరిటా థ‌మ‌న్ ఒక వీడియో పంచుకున్నాడు

Published By: HashtagU Telugu Desk
The Sounds Of Gamechanger

The Sounds Of Gamechanger

The Sounds Of GameChanger : డైరెక్టర్ శంకర్ (Shankar) – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram CHaran) కలయికలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్ (Game Changer). దిల్ రాజు నిర్మాణంలో పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటుంది. కాగా ఈ సినిమా విషయంలో మొదటి నుండి మెగా అభిమానులు నిరాశలోనే ఉన్న సంగతి తెలిసిందే. షూటింగ్ ఆలస్యం అవ్వడం, సినిమా ప్రమోషన్స్ సైతం పెద్దగా చేయకపోవడం, ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోవడం, రిలీజ్ డేట్స్ కూడా మారుస్తూ ఉండడం తో అభిమానులంతా మేకర్స్ పై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ తరుణంలో మేకర్స్ సడెన్ సర్ప్రైస్ ఇచ్చారు. ఈ సినిమాలోని మ్యూజిక్‌కు సంబంధించి ది సౌండ్స్‌ ఆఫ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ (The Sounds Of GameChanger) పేరిటా థ‌మ‌న్ ఒక వీడియో పంచుకున్నాడు. ఈ వీడియోలో ద‌ర్శ‌కుడు శంక‌ర్‌తో థ‌మ‌న్ ‘గేమ్‌ ఛేంజర్‌’ ఎంట్రీ సాంగ్‌ గురించి ఈ వీడియోలో మాట్లాడ‌టం చూడ‌వ‌చ్చు.

ఇదిలా ఉంటె..ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ‘రా మ‌చ్చా మ‌చ్చా’ (Raa Macha Macha) అనే సాంగ్ ప్రోమోను సెప్టెంబ‌ర్ 28న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే ఫుల్ సాంగ్‌ను ఎప్పుడు విడుద‌ల చేస్తుంది అనేది మాత్రం ప్రకటించకపోయేసరికి ఫ్యాన్స్ కాస్త ఆగ్రహంగా ఉన్న నేపథ్యంలో థ‌మ‌న్ వీడియో పంచడం కాస్త కూల్ అయ్యారు. పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌స్తున్న ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌ రాజు తెర‌కెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాను 2024 క్రిస్మస్​ కానుక‌గా డిసెంబ‌ర్ 20న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్.

Read Also : PM Modi: ‘పరమ రుద్ర’ సూపర్‌ కంప్యూటర్లను ఆవిష్కరించిన ప్రధాని మోడీ

  Last Updated: 26 Sep 2024, 07:57 PM IST