హీరో రానా (Rana) ‘ది రానా దగ్గుబాటి షో’ (The Rana Daggubati Show) సెలబ్రెటీ టాక్ షో నవంబర్ 23 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ షోలో పాల్గొనే సెలబ్రెటీలతో ట్రైలర్ వీడియోను తాజాగా రిలీజ్ చేశారు. హీరోలు నాని, నాగచైతన్య, సిద్ధు, తేజా సజ్జ, రిషబ్ శెట్టి, దుల్కర్ సల్మాన్.. హీరోయిన్లు ప్రియాంక మోహన్, శ్రీలీల, మీనాక్షి వంటి వారు గెస్టులు గా రాబోతున్నారు. అలాగే డైరెక్టర్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ కూడా ఈ షోలో సందడి చేయనున్నారు.
షోలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు, సరదా ముచ్చట్లు, అనుభవాలు, మరియు గేమ్స్ ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఇక ఈ షో నిర్వహణతో పాటు, సృష్టికర్త, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా రానానే కావడం విశేషం. గతంలో ఈ టాక్ షో గురించి రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. “సెలబ్రిటీల నిజ జీవితానికి సంబంధించిన విషయాల్ని తెలుసుకునేందుకు మా షో ఓ ప్రత్యేక వేదిక కానుంది. ఇది ఓ టాక్ షో మాత్రమే కాదు. అంతకుమించి. షో కు రానున్న అతిథుల్లో చాలామంది నా స్నేహితులు, కో స్టార్స్ ఉన్నారు. వాళ్ల నుంచి ఎన్నో ఊహించని విషయాలు బయట పడతాయి” అని రానా చెప్పుకొచ్చారు.
ఇక రానా హోస్ట్ గా వ్యవహరించడం ఇది మొదటిసారి కాదు. గతంలో ఆయన నెం.1యారి అనే టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ టాక్ షో మంచి ఆదరణను దక్కించుకుంది. టాలీవుడ్‌కు చెందిన చాలా మంది నటీ నటులు ఈ టాక్ షో కార్యక్రమంలో పాల్గొని, తమ సినిమా సంగతులతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సరదా విషయాలు కూడా చెప్పడం జరిగింది.
ఇక రానా విషయానికి వస్తే..లీడర్ మూవీ తో వెండితెరకు హీరోగా పరిచమయ్యాడు. మొదటి సినిమాతోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన “బాహుబలి: ది బిగినింగ్” (2015) మరియు “బాహుబలి: ది కన్‌క్లూజన్” (2017) చిత్రాల్లో భల్లాలదేవ పాత్ర..రానాకు జాతీయ స్థాయి గుర్తింపును కలిగించింది. ప్రస్తుతం సినిమాలు చేయడం తగ్గించిన..ఆయన క్రేజ్ మాత్రం రవ్వంత కూడా తగ్గలేదు.
Read Also : Maharashtra Elections 2024: పవన్ కళ్యాణ్ కు బీజేపీ కీలక బాధ్యతలు.. రోడ్ మ్యాప్ ఇదే!