Site icon HashtagU Telugu

The Raja Saab : ప్రభాస్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే అప్డేట్ ఇచ్చిన నిర్మాత

Rajasaabh Records

Rajasaabh Records

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న తాజా చిత్రం ‘రాజాసాబ్’ (The Raja Saab) పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాత ఎస్‌కెఎన్ (SKN) ఆసక్తికర అప్డేట్‌ను షేర్ చేశారు. మరో రెండు వారాల్లో టీజర్‌ను విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ ప్రకటనతో ప్రభాస్ ఫ్యాన్స్‌లో నూతన ఉత్సాహం నెలకొంది.

Rishabh Pant: రిష‌బ్ పంత్ చేతికి రూ. 27 కోట్లు వ‌స్తాయా? క‌టింగ్ త‌ర్వాత ఎంత వ‌స్తుందో తెలుసా?

దర్శకుడు మారుతి ఈ విషయంపై హామీ ఇచ్చినట్లు SKN వెల్లడించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. “అన్ని సెట్ అయ్యాయి, మీ అందరికోసం టీజర్ రాబోతోంది” అనే మాటలు అభిమానుల్లో కొత్త జోష్‌ను నింపాయి. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు విశేష స్పందన పొందగా, టీజర్ మాత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ప్రభాస్ ఇప్పటికే వరుసగా పెద్ద సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఈ సినిమా తనకు ప్రత్యేకంగా ఉంటుందని చెప్పడం జరిగింది. మారుతి మార్క్‌ హారర్ కామెడీ శైలిలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం టాలీవుడ్‌తో పాటు ఇతర భాషల ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా ఉండనుంది. టీజర్‌ విడుదల అనంతరం సినిమా ప్రమోషన్ మరింత స్పీడ్ చేస్తారని తెలుస్తుంది.