PM Praised Pathaan: ప్రధాని మెచ్చిన ‘పఠాన్’.. పార్లమెంట్ లో మోడీ స్పీచ్!

పఠాన్ మూవీ ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi)ని సైతం ఆకర్షించింది. ఈ సినిమా విజయాన్ని లోక్ సభ లో గర్వంగా చెప్పుకున్నాడు.

  • Written By:
  • Updated On - February 9, 2023 / 01:00 PM IST

తగ్గేదేలే అంటూ దేశ వ్యాప్తంగా షారుఖ్ ఖాన్ సినిమా ‘పఠాన్’ (Pathaan) దూసుకుపోతోంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అన్ని వుడ్లలోనూ ఈ సినిమా తిరుగులేదని నిరూపించుకుంటోంది. ఎన్ని వివాదాలు చుట్టి ముట్టినా కలెక్షన్ల వర్షం కురిస్తూ సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటికే కేజీఎఫ్, బాహుబలి, కాంతార రికార్డులను కొల్లగొట్టిన పఠాన్ మూవీ ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi)ని సైతం ఆకర్షించింది. ఈ సినిమా విజయాన్ని లోక్ సభ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గర్వంగా చెప్పుకున్నాడు. పఠాన్ సినిమా విజయాన్ని ఉద్దేశించి పార్లమెంట్లో (Parliament) ప్రసంగించారు.

పఠాన్ పై పార్లమెంట్ లో ప్రసంగం

కాశ్మీర్లో (Kashmir) థియేటర్లు హౌస్ ఫుల్ గా నడుస్తున్నాయని, అనేక దశాబ్దాల తర్వాత శ్రీనగర్ లో బాలీవుడ్ (Bollwood) సినిమాలు ఆడుతున్నాయని వివరించారు. పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి చురకలు అంటించారు. ఇదే సమయంలో బాలీవుడ్ సినిమాలు, నటీనటులపై అనవసరమైన వ్యాఖ్యలు చేయకూడదని పార్టీ శ్రేణులకు హితవు పలికారు. కాశ్మీర్లో ఒకప్పుడు ఉగ్రవాదులు రాజ్యమేలారని, ఇప్పుడు వారి ఆటలు సాగడం లేదని, అందుకు నిదర్శనమే షారుక్ ఖాన్ నటించిన పఠాన్ (Pathaan) సినిమా అని మోడీ వివరించారు. శ్రీనగర్ లోని రామ్ మున్షీ బాగ్ ఐనాక్స్ హౌస్ ఫుల్ షోలతో రన్ అవుతుందని, కాశ్మీర్లో తాము చేసిన గొప్ప పనులకు ఇది ఉదాహరణ అని మోడీ గర్వంగా ప్రకటించుకున్నారు.

అందుకు నిదర్శనమే పఠాన్ విజయం

వాస్తవానికి పుల్వామా దాడి తర్వాత నరేంద్ర మోడీ కాశ్మీర్ పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అజిత్ దోవల్ నాయకత్వంలో భద్రత దళాలను మరింత పరిపుష్టం చేశారు. సరిహద్దులో చొరబాట్లను నియంత్రిస్తూనే, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశారు. ఉగ్రవాదులకు నగదు (Money transfer) సరఫరాకు కళ్లెం వేశారు. ఫలితంగా వారి ఆగడాలు తగ్గుముఖం పట్టాయి. ఇదే నేపథ్యంలో పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడటంతో మోడీ ఏం కోరుకున్నాడో అది జరగడం ప్రారంభమైంది. మరోవైపు కేంద్రం (Central Govt) భరోసా మెండుగా ఇవ్వడంతో కార్పొరేట్ కంపెనీలు కాశ్మీర్లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాయి. ఉగ్రవాదుల దాడులతో నిత్యం భీతిల్లిన కాశ్మీరీ ప్రజలకు వినోదం కోసం సినిమా థియేటర్లను ప్రారంభించడం మొదలైంది. ఇందులో భాగంగా ఐనాక్స్ కంపెనీ రామ్ మున్షిబాగ్ లో పెద్ద థియేటర్ నిర్మించింది. ఇందులో ప్రదర్శితమయ్యే సినిమాలు చూసేందుకు జనం భారీగా వస్తున్నారు. అందుకు నిదర్శనమే పఠాన్ (Pathaan) సినిమా విజయం.

రికార్డు స్థాయిలో కలెక్షన్లు

షారూఖ్ ఖాన్ హీరోగా సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించిన యాక్షన్ మూవీ ‘పఠాన్’కు ఆరంభంలోనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. దీనికితోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గానే వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీ స్థాయిలోనే వస్తున్నాయి. ఇలా 14 రోజుల్లో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 446 కోట్లు నెట్‌, రూ. 865 కోట్లు గ్రాస్ (Collections) వసూలు అయింది.

Also Read: The Kashmir Files: ‘ది క‌శ్మీర్ ఫైల్స్‌` మూవీకి భాస్క‌ర్ అవార్డు కూడా రాదు: ప్రకాశ్ రాజ్