Site icon HashtagU Telugu

RGV : వర్మ బెడ్ రూమ్ ను వాడుకున్న పనిమనిషి..

Varma Bedroom

Varma Bedroom

రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)…ఈయన తెలియని సినీ లవర్స్ లేరు. ఒకప్పుడు టాలీవుడ్ చరిత్రను తిరగరాసిన మూవీస్ తెరకెక్కించిన డైరెక్టర్ ఈయన..ఈయన ను ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది చిత్రసీమలో అడుగుపెట్టి అగ్ర డైరెక్టర్లు గా , అసిస్టెంట్ డైరెక్టర్స్ గా మాటల రచయితగా టాప్ పొజిషన్ కు వెళ్లిన వారు చాలామందే ఉన్నారు. వర్మ నుండి సినిమా వస్తుందంటే సినీ లవర్స్ , అభిమానులే కాదు సినీ ప్రముఖులు సైతం ఆసక్తి కనపరిచేవారు. అలాంటి వర్మ..ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ అయ్యాడు. ఇప్పుడు వర్మ నుండి సినిమా వస్తుందంటే కనీసం ప్రమోషన్ ఖర్చుల అంత కూడా వస్తాయా..? అని మాట్లాడుకుంటున్నారంటే వర్మ ఇంతకు పడిపోయారో అర్ధం చేసుకోవాలి. సినిమా కథల ఫై కంటే ఇతర విషయాల ఫై ఎక్కువ ఫోకస్ పెడుతూ దిగజారిపోయాడు. కానీ సోషల్ మీడియా లో మాత్రం ఆయన ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఆయన ఓ ట్వీట్ చేసాడంటే అది వైరల్ అవ్వాల్సిందే. ఎవరికీ భయపడకుండా..మనసులో ఏమనిపిస్తే అది బయటకు చెప్పేయడం వర్మ ప్రత్యేకం. అందుకే చాలామంది నెటిజన్లు ఆయన్ను ఫాలో అవుతుంటారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూ లో తన లైఫ్ లో జరిగిన ఓ సంఘటను తెలియజేసారు. నేను నా భార్య ఇద్దరం సినిమాకు వెళ్లాం. కానీ, ఆ సినిమా బాగాలేదని మధ్యలోనే ఇంటికి వచ్చాం. ఆ సమయంలో తన పనిమనిషి వేరే పరాయి వ్యక్తితో మా బెడ్ రూంలో కనిపించింది. వాస్తవానికి ఆ విషయం నేను గమించలేదు. నా భార్య వారిద్దరూ కలిసి ఉండటానికి చూసి.. గట్టిగా అరిచింది. వెంటనే నేను అక్కడికి వెళ్లి.. రెండు విషయాలు తన భార్య కు చెప్పినట్లు తెలిపాడు. తాను మన పనిమనిషి.. తాను ఏంటో? తన పర్సనల్ (సె**) లైఫ్ ఏంటో? వేరు. ఎవరితో సె** ఎఫైర్ పెట్టుకుంటుందో అని నీకు సంబంధం లేదు. రెండోది మనం లేనప్పుడు వేరు వ్యక్తి ఇంట్లో రానిస్తుందనడం అది మన ఇంటి సెక్యూరిటీ విషయం. ఈ విషయంలో ఆ పనిమనిషికి వార్నింగ్ ఇస్తావా? లేదా పనిలో నుంచి తీసివేస్తావా? అనేదే నీ ఇష్టం. కానీ తన సె** లైఫ్ తో నీకు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయాన్ని గుర్తుకు పెట్టుకోని చర్య తీసుకో’ అని తన భార్యకు చెప్పానని తనదైన శైలి వర్మ చెప్పుకొచ్చాడు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Read Also : Hydraa : ముందు హైడ్రా..GHMC ఆఫీసులను కూల్చాలని కేటీఆర్ డిమాండ్