తారకరత్న (Taraka Ratna) శనివారం సాయత్రం 4.10 గంగలకు తుది శ్వాస విడిచారని టీడీపీ వర్గాల్లోని సమాచారం. కుటుంబ సభ్యులకు ఒక్క సారిగా చెప్పలేని పరిస్థితుల్లో బాలకృష్ణ కు ముందుగా సమాచారం అందించి ఆ తరువాత చంద్రబాబుతో సహా కుటుంబంలోని ఇతరులకు చెప్పారు. హైదారాబాద్ కు తరలించే క్రమంలో తారకరత్న ఇక లేరనే విషయం బయటకు వచ్చింది. బెంగుళూరు నుంచి అంబులెన్సులో తారకరత్న భౌతిక కాయాన్ని హైదరాబాద్ కు తరలించారు. అప్పటి వరకు ఆస్పత్రిలోనే ఉన్న తారకరత్న సతీమణి, కుటుంబ సభ్యులు ఒక్క సారిగా షాక్ కు గురయ్యారు. వారికి బాలకృష్ణ ధైర్యం చెప్పారు. సోమవారం తారకరత్న అంత్యక్రియలు జరగనున్నాయి.
కుప్పంలో లోకేష్ యువగళం ప్రారంభం రోజు గుండెపోటుకు గురైన తారకరత్నకు అక్కడే తొలుత ప్రాధమిక చికిత్స చేసారు. ఆ సమయంలో చికిత్స బాధ్యతలను నందమూరి బాలకృష్ణ పర్యవేక్షించారు. హైదరాబాద్ వైద్యులతో మాట్లాడిన తరువాత బెంగుళూరు నారాయణ హృదయాలయకు తరలించారు. నారాయణ హృదయాలయ వైద్యులతో మాట్లాడి నిపుణుల టీంతో ఉన్న అంబులెన్సును కుప్పంకు రప్పించారు. కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయటంతో అంబులెన్సు ద్వారా కుప్పం నుంచి బెంగళూరు నారాయణ హృదయాలయ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో గుండెకు సంబంధించి ఎటువంటి సమస్య లేదని తేల్చారు. కానీ, గుండెపోటు వచ్చిన సమయంలో మెదడుకు నష్టం జరిగిందని గుర్తించారు. మెదడు లో వాపు ఉందని, తగ్గితేనే చికిత్స పూర్తవుతుందని వైద్యులు వెల్లడించారు
తారకరత్న (Taraka Ratna) 23 రోజుల పాటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడారు. విదేశీ వైద్యుల టీం ప్రతీ క్షణం పర్యవేక్షణ చేస్తూ చికిత్స అందించింది. కానీ,శనివారం ఉదయం నుంచే తారకరత్న ఆరోగ్యం తీవ్ర విషమంగా మారింది. వెంటనే కుటుంబ సభ్యులకు వైద్యలు సమాచారం ఇచ్చారు. తొలి నుంచి తారకరత్న ఆరోగ్యం గురించి పర్యవేక్షిస్తున్న నందమూరి బాలకృష్ణతో మాట్లాడారు. పరిస్థితి వివరించారు. వెంటనే బాలకృష్ణతో పాటుగా మరి కొందరు ఆస్పత్రికి చేరుకున్నారు. రాత్రికి తారకరత్న మరణించినట్లు న్యూస్ బయటకు వచ్చింది. కానీ, తారకరత్న సాయంత్రమే మరణించినట్లుగా సమాచారం తెలుస్తోంది. నారాయణ హృదయాలయ హాస్పిటల్ వైద్యులు చివరి నిమిషం వరకు తారకరత్నను సేవ్ చేసేందుకు ప్రయత్నాలు చేశారు.
నారాయణ హృదయాలయ వైద్యులతో బాలకృష్ణ తో పాటుగా కర్ణాటక మంత్రి సుధాకర్ చర్చల తరువాత విదేశీ వైద్యులను రప్పించారు. తారకరత్నకు చికిత్స చేయించారు. నిత్యం పరీక్షలు చేస్తూనే చేశారు. మెదడు సంబంధింత సమస్యలో మాత్రం మార్పు రాలేదు. తారకరత్న కోమాలోనే ఉన్నా, ఇతర అవయవాల పని తీరు బాగానే ఉందని పరీక్షల్లో తేలింది. కానీ, శుక్రవారం రాత్రి నుంచి ఆరోగ్యంలో మార్పు కనిపించిందని సమాచారం. శనివారం ఉదయానికి మరింతగా పరిస్థితి విషమించింది. వైద్యుల సమాచారంతో మధ్నాహ్నాం సమయానికి బాలకృష్ణ .కుటుంబ సభ్యు లు ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్యులు తారకరత్న పరిస్థితిని వివరించారు. అప్పటికే విషమంగా మారిందని తెలుస్తుంది.
Also Read: AP Politics: జగన్ మరో ఛాన్స్ కోసం కేసీఆర్ వ్యూహం! పవన్ పై బీఆర్ఎస్ నీడ!