Site icon HashtagU Telugu

tax free: “ది కేరళ స్టోరీ”పై ట్యాక్స్ రద్దు.. ఎక్కడో తెలుసా ?

Kerala

Kerala

వివాదాస్పద మూవీ ‘ది కేరళ స్టోరీ’పై మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దానిపై ట్యాక్స్ ను రద్దు (tax free) చేస్తున్నట్లు ప్రకటించింది. స్వయంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈవిషయాన్ని వెల్లడించారు. మధ్యప్రదేశ్ లో తాము మతమార్పిడులకు వ్యతిరేకంగా చట్టం చేశామని ఆయన గుర్తు చేశారు. ‘ది కేరళ స్టోరీ’ సినిమా ఉగ్ర కుట్రలు, మత మార్పిడుల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తుందని .. అందుకే దానిపై ట్యాక్స్ విధించకూడదని (tax free) నిర్ణయించామన్నారు. ‘లవ్ జిహాద్’, ఉగ్రవాదం, మతమార్పిడుల కుట్రల్ని ఈ సినిమా బయటకు తెస్తుందని ఆయన కామెంట్ చేశారు.

ALSO READ : PM Narendra: ది కేరళ స్టోరీ సినిమాకు మద్దతు తెలిపిన మోడీ.. కర్ణాటక పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ?

క్షణికావేశంలో లవ్ జిహాద్ వలలో చిక్కుకుని యువతులు తమ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటారో ఈ సినిమా చూపిస్తుందని, ఉగ్రవాద కుట్రల్ని బహిర్గతం చేస్తుందని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. అంతకుముందు శుక్రవారం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ ఈ సినిమాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద కుట్రలను బయటకు తీసుకువచ్చినందుకు కాంగ్రెస్, సీపీఎం పార్టీలు ‘ది కేరళ స్టోరీ’పై దాడి చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ సినిమా విడుదల చేయకుండా స్టే ఇవ్వాలని పలువురు సుప్రీంకోర్టు, కేరళ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ..కోర్టులు అందుకు నిరాకరించాయి. దీంతో శుక్రవారం రోజున దేశవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద భద్రతను కల్పించారు.

Exit mobile version