RaviTeja & Gopichand: టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. అలాంటి కాంబినేషన్స్ ఒక్కసారి కలిస్తే అంతే రికార్డులు బద్దలు కావాల్సిందే. థియేటర్స్ దద్దరిల్లిపోవాల్సిందే. ఆ కాంబినేషన్ పేరే రవితేజ-, గోపీచంద్ మలినేని. ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ వచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇన్నేళ్లకు ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. క్రాక్ సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే ఈసారి కూడా నిర్మాతగా వ్యవహరించబోతోంది.
గోపీచంద్ మలినేనిని దర్శకుడిగా మార్చిందే రవితేజ. డాన్ శీను అనే సినిమాకో మలినేని దర్శకుడిగా మారాడు. ఆ కృతజ్ఞత అతడికి ఎప్పుడూ ఉంది. అంతేకాదు, డాన్ శీను తర్వాత బలుపు అనే సినిమా కూడా చేశాడు. ఆ తర్వాత క్రాక్ అనే సినిమా చేశాడు. ఇలా వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా హిట్టయింది.
రవితేజ బాడీ లాంగ్వేజ్ ను, కామెడీ టైమింగ్ ను పెర్ ఫెక్ట్ గా క్యాష్ చేసుకుంటాడనే పేరుంది గోపీచంద్ మలినేనికి. సో.. ఈసారి వీళ్లిద్దరి నుంచి మరో హిట్ సినిమా ఆశించొచ్చు. ఈరోజు లేదా రేపు ఈ సినిమా ప్రకటన రాబోతోంది. సెంటిమెంట్ ను కొనసాగిస్తూ.. ఈ ప్రాజెక్టులోకి కూడా శృతిహాసన్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నాడు గోపీచంద్ మలినేని. బాలయ్యను తెరపై చూపించడంలో బోయపాటికి మాత్రమే సాధ్యం, ఆ తర్వాత రవితేజను కూడా ప్రజెంట్ చేయడంలో గోపిచంద్ కు ఆ ప్రత్యేకత ఉంది.
Also Read: RaviTeja & Gopichand: హిట్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది