Family Star: ఓటీటీలో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్

  • Written By:
  • Publish Date - May 7, 2024 / 03:38 PM IST

Family Star: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ది ఫ్యామిలీ స్టార్ చిత్రం 2024 ఏప్రిల్ 5న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది. కానీ ఓటీటీలో పరశురామ్ పెట్ల మూవీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా 10 రోజులకు పైగా మూవీ ఛార్టుల్లో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. థియేటర్లలో అంతగా రెస్పాన్స్ లేకపోయినా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతుండటం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.

గోపీసుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. అభినయ, వాసుకి, రోహిణి హట్టంగడి, రవిబాబు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటి వరకు ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. 21 కోట్ల షేర్, 30 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 10 కోట్ల రూపాయలు మేర కలెక్షన్లను నమోదు చేసింది. ఈ సినిమా సుమారుగా 40 కోట్ల వసూళ్లతో క్లోజ్ కలెక్షన్లను నమోదు చేసింది.