Site icon HashtagU Telugu

Nayanthara: నయనతార గ్లామర్ సీక్రెట్స్ ఏంటో మీకు తెలుసా!

Nayanatara

Nayanatara

40 ఏళ్లలో కూడా 20 ఏళ్లలా మెరిసిపోతుంటారు కొందరు హీరోయిన్స్. అలాంటివారిలో నయనతార ఒకరు. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పట్నుంచి, ఇప్పటివరకు ఈ బ్యూటీ కెరీర్ గ్రాఫ్ తగ్గలేదు. తెలుగు తమిళ, మలయాళ భాషల్లో ఆమె స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతోంది. సౌత్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ గా కూడా ఆమెకి పేరుంది. సుదీర్ఘ కాలంగా కెరియర్ ను కొనసాగిస్తున్న ఆమె, ఇప్పటికీ అదే గ్లామర్ మెయింటైన్ చేస్తోంది. తాజాగా నయనతారకి ఆమె గ్లామర్ కి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. అందుకు ఆమె స్పందిస్తూ.. తన గ్లామర్ సీక్రెట్ ను బయటపెట్టింది. అది కూడా చాలా సింపుల్ సీక్రెట్.

“ప్రతి రోజూ జిమ్ లో వర్కౌట్స్ చేస్తాను. అలాగే క్రమం తప్పకుండా యోగా చేస్తాను. నేను ఏదైతే డైట్ ను ప్లాన్ చేసుకున్నానో, అదే డైట్ ను తీసుకుంటాను. దాదాపు ఈ విషయంలో మార్పు రాకుండా చూసుకుంటాను. మంచి నీళ్లు ఎక్కువగా తాగుతాను. మంచి నీళ్లను మించిన ఔషధం లేదనేది నా అభిప్రాయం. ఇక 8 గంటల పాటు నిద్రపోతాను. నేను ఫిట్ నెస్ తో.. గ్లామర్ గా కనిపించడానికి ఇదే కారణం” ఇలా తన గ్లామర్ సీక్రెట్ బయటపెట్టింది నయనతార. ఆమె నటించిన తాజా చిత్రం ఇరైవన్. ఆగస్ట్ 25న ఈ సినిమా ప్రేక్షకుముందుకు రానుంది. మరోవైపు ఆమె విఘ్నేష్ శివన్ తో తన ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఇద్దరు పిల్లలున్నా చెక్కుచెదరని అందంతో అలరిస్తోంది.

Also Read: 10 Killed : పెళ్లి బస్సు బోల్తా.. 10 మంది మృతి