Site icon HashtagU Telugu

Bigg Boss : బిగ్​బాస్​ సీజన్​ 8‌లోకి ఆ టాలీవుడ్ హీరో ఎంట్రీ ?

Bigg Boss Season 8

Bigg Boss :  ‘బిగ్​బాస్​ సీజన్​ 8’ కోసం అందరూ ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు.  అది ఎప్పుడెప్పుడు టెలికాస్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. జనంలో బిగ్‌బాస్ కార్యక్రమానికి అంతగా క్రేజ్ వచ్చింది. ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లోకి ఒక టాలీవుడ్ హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నారట.. వివరాలివీ..

We’re now on WhatsApp. Click to Join

బిగ్​బాస్​ సీజన్​ 8లోకి ఎవరు ఎంట్రీ ఇస్తారు ? అనే దానిపై సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య భీకర చర్చ జరుగుతోంది. వారంతా ప్రధానంగా చర్చించుకుంటున్న పేర్లలో.. నయని పావని, వింధ్య విశాఖ, జబర్దస్త్ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ, అమృతా ప్రణయ్, రీతూ చౌదరి, కుమారీ ఆంటీ, బర్రెలక్క, యూట్యూబర్ బమ్ చిక్ బబ్లూ, నటి సోనియా సింగ్, హీరోయిన్ కుషితా కల్లపు, సురేఖ వాణి, సుప్రిత ఉన్నారు. వీరితో పాటు ఒక టాలీవుడ్ ప్రముఖ నటుడు కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి వస్తారని సమాచారం. ఆ నటుడు మరెవరో కాదు.. కమెడియన్​ కమ్​ హీరో అభినవ్​ గోమఠం అని అంచనా వేస్తున్నారు. “మస్త్ షేడ్స్ ఉన్నాయ్‌రా.. నీలో” అని ఆయన చెప్పిన డైలాగ్ బాగా ఫేమస్ అయింది. అభినవ్ తొలుత కామెడీ పాత్రలే వేసేవారు. తర్వాత క్రమంగా హీరో స్థాయికి ఎదిగారు. ఇందులో నిజమెంత ? అనేది తెలియాలంటే బిగ్‌బాస్‌లో పాల్గొనే వారి పేర్లతో కూడిన అధికారిక జాబితా విడుదలయ్యే వరకు వేచిచూడాల్సిందే.బిగ్‌బాస్ సీజన్8 షూటింగ్ కోసం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్​ వేస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి లేదా 8వ తేదీ నుంచి బిగ్ బాస్(Bigg Boss) కొత్త సీజన్‌ను మొదలుపెడతారనే అంచనాలు వెలువడుతున్నాయి.

Also Read :Vinesh Phogat : సొంతూరిలో వినేశ్ ఫొగాట్‌ ఎమోషనల్.. గ్రామస్తులు ఏం ఇచ్చారో తెలుసా?

నాగార్జున‌నే హోస్ట్‌

ఈసారి బిగ్‌బాస్ సీజ‌న్ 8కు కూడా నాగార్జున‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఆయన స్థానంలో హోస్ట్‌గా కొందరు స్టార్ హీరోల పేర్లు వినిపించినా.. అవన్నీ అవాస్తవాలని తేలింది. నాగార్జున చరిష్మా వల్ల బిగ్‌బాస్ సీజ‌న్ 7 స‌క్సెస్ కావ‌డంతో హోస్ట్‌ను మార్చాల‌నే నిర్ణ‌యంపై బిగ్‌బాస్ కార్యక్రమం యాజ‌మాన్యం వెన‌క్కి తగ్గినట్లు తెలుస్తోంది.