Site icon HashtagU Telugu

Tharun Bhascker : నటుడిగా బిజీ అవుతున్న తరుణ్ భాస్కర్.. మలయాళ రీమేక్‌లో..

Tharun Bhascker Signs For Main Lead To Jaya Jaya Jaya Jaya Hey Remake

Tharun Bhascker Signs For Main Lead To Jaya Jaya Jaya Jaya Hey Remake

Tharun Bhascker : టాలీవుడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్.. డైరెక్టర్‌గా కంటే నటుడు గానే ఎక్కువ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘పెళ్లి చూపులు’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యి.. మొదటి సినిమాకే నేషనల్ అవార్డుని అందుకున్నారు. ఇక ఆ తరువాత మూడు సినిమాలు మాత్రమే దర్శకుడిగా తెరకెక్కించారు. కానీ నటుడిగా మాత్రం చాలా సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. రీసెంట్ గా మెయిన్ లీడ్ రోల్ కి మరికొన్ని సినిమాలకు కూడా సైన్ చేసినట్లు సమాచారం.

ఇటీవల మలయాళంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్టుగా నిలిచిన సినిమా ‘జయ జయ జయ జయ హే’. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేసేందుకు సిద్ధం చేస్తున్నారట. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ‘సరిగ్గా చదువులేని భర్త చేతిలో ఇబ్బందులు పడుతున్న ఓ చదువుకున్న భార్య కథ’. భర్త పెట్టే ఇబ్బందులను ఆ భార్య ఎలా తిప్పికోట్టింది అనే విషయాన్ని బ్లాక్ కామెడీ నేపథ్యంతో చెప్పుకొచ్చారు.

మూవీలో హీరో పాత్ర నెగటివ్ షేడ్స్ ఉంటాయి. ఈ పాత్రనే తరుణ్ భాస్కర్ చేయబోతున్నారట. మరి హీరోయిన్ పాత్రని ఎవరు చేస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది. అలాగే ఈ మూవీ దర్శకనిర్మాతల వివరాలు కూడా తెలియాల్సి ఉంది. కాగా ఈ సినిమా ఆల్రెడీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ తో ఓటీటీలో అందుబాటులో ఉంది. మరి ఇప్పటికే చూసేసిన ఈ కథని తెలుగు ఆడియన్స్ మళ్ళీ ఆదరిస్తారా లేదా చూడాలి.

కాగా తరుణ్ భాస్కర్ ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాల్లో కూడా హీరో నటించేందుకు ఓకే చెప్పినట్లు ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో తరుణ్ హీరోగా నటించారు. ఆ తరువాత మళ్ళీ హీరో పాత్రని చేయలేదు. ఇప్పుడు మళ్ళీ మెయిన్ లీడ్ ఛాన్స్ లు అందుకుంటూ నటుడిగా బిజీ అవుతున్నారు.

Also read : Kannappa : కన్నప్ప సెట్స్ లోకి అడుగుపెట్టిన అక్షయ్ కుమార్..