Site icon HashtagU Telugu

OG First Single : ‘ఓజీ” ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన తమన్

OG Collections

OG Collections

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఓజీ’ (OG)సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి యువ డైరెక్టర్ సుజీత్ (Sujeeth) దర్శకత్వం వహిస్తున్నాడు. స్టైలిష్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీకి సంగీత దర్శకుడిగా తమన్ (Thaman) పని చేస్తున్నారు. తాజాగా తమన్ ఈ సినిమా ఫస్ట్ సింగిల్ గురించి ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు.

Virat Kohli: ఆ విషయంపై తొలిసారి మౌనం వీడిన విరాట్ కోహ్లీ!

తమన్ చెప్పిన వివరాల ప్రకారం.. పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ సెట్స్‌లో అడుగుపెట్టిన రోజే ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌గా ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయనున్నట్టు తెలిపారు. ముందుగా ఈ పాటను విడుదల చేయాలనుకున్నా, కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు. త్వరలో పవన్ షూటింగ్లో మళ్లీ జాయిన్ అవుతారనీ, ఆ సందర్భంగా పాటను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

Sravan Rao : నాలుగోసారి సిట్‌ విచారణకు హాజరైన శ్రవణ్‌రావు

ఇదిలా ఉంటే.. ‘ఓజీ’ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తయిందని తమన్ పేర్కొన్నారు. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫస్ట్ సింగిల్.. పవన్ మాస్ యాటిట్యూడ్‌కి తగ్గట్లుగా పవర్‌ఫుల్ మ్యూజిక్‌తో అందుబాటులోకి రానుంది. మేకర్స్ నుంచి త్వరలోనే అధికారిక విడుదల తేదీ ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఈ మూవీ లో పవన్‌ కల్యాణ్ ‘ఓజాస్‌ గంభీర’ అనే పవర్​ ఫుల్​ పాత్రలో కనిపించనున్నారు. ఆయన్ని ఢీకొట్టే ప్రతినాయకుడిగానే బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్‌ నటిస్తున్నారు. యుంగ్​ బ్యూటీ ప్రియాంకా మోహన్‌ హీరోయిన్​గా నటిస్తోంది. వింటేజ్​ నటి శ్రియా రెడ్డి కీలక పాత్ర పోషిస్తోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2025 ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.

Exit mobile version