బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో అఖండ (Akhanda ) కు సీక్వెల్ గా అఖండ 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అఖండ భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఈ సీక్వెల్ పై అభిమానుల్లో అంచనాలు స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలో డాకు మహారాజ్ సక్సెస్ మీట్ లో అఖండ 2 ఎలా ఉండబోతుందో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తెలిపి అంచనాలు రెట్టింపు చేసాడు. బాబీ – బాలకృష్ణ కలయికలో తెరకెక్కిన డాకు మహారాజ్ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది.
India vs England: అభిషేక్ శర్మ ఊచకోత.. టీమిండియా ఘన విజయం
ఈ క్రమంలో ఈరోజు బుధువారం అనంతపూర్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ ఈవెంట్ లో థమన్ మాట్లాడుతూ..అఖండ 2 ఇంటర్వెల్ కే పూర్తి డబ్బులు ఇచ్చేయొచ్చని అంత కసిగా దర్శకుడు బోయపాటి శీను తెరకెక్కిస్తున్నారని, ముందే ప్రిపేర్ అయిపోమని అభిమానులకు పిలుపు ఇవ్వడం ఒక్కసారిగా హైప్ ని ఎక్కడికో తీసుకెళ్లింది. అఖండలో కీలకంగా నిలిచింది ఇంటర్వెల్ ఎపిసోడే. వన్ అఫ్ ది బెస్ట్ టాలీవుడ్ ఇంటర్వెల్స్ గా దీని గురించి చాలామందిచెబుతూ ఉంటారు. అలాంటిది అఖండ 2లో అంతకు మించే ఉంటుందని థమన్ చెప్పకనే చెప్పడం తో సినిమా ఎప్పుడెప్పుడు పూర్తి అవుతుందా..? ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆత్రుత అందరిలో పెరుగుతుంది. సెప్టెంబర్ 25 న ఈ మూవీ ని ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.