Thalapathy Vijay GOAT దళపతి విజయ్ వెంకట్ ప్రభు కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా The G.O.A.T. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయ్ డ్యుయల్ రోల్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది. త్వరలో రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ దళపతి ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. సినిమా లో గ్రాఫిక్స్ ఎక్కువగా అవసరం ఉన్న కారణంగా ఏకంగా హాలీవుడ్ వి.ఎఫ్.ఎక్స్ టెక్నీషియన్స్ ని ఈ సినిమా కోసం తీసుకొస్తున్నారట.
మార్వెల్ సీరీస్ లో భాగమైన అవెంజర్స్, ఇంకా అవతార్ సినిమాకు పనిచేసిన వి.ఎఫ్.ఎక్స్ ఎక్స్ పర్ట్స్ The G.O.A.T కోసం పనిచేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో కొన్ని సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతాయని అంటున్నారు. వాటి కోసమే మేకర్స్ హాలీవుడ్ లో గ్రాఫిక్స్ పనిచేయిస్తున్నారని తెలుస్తుంది.
ఈ సినిమాలో మరో హీరోయిన్ గా త్రిష కూడా ఉంటుందని టాక్. ఆల్రెడీ చాలా గ్యాప్ తర్వాత విజయ్ తో త్రిష కలిసి లియో సినిమాలో నటించింది. మళ్లీ The G.O.A.T లో కూడా త్రిష ఉంటుందని అంటున్నారు. దళపతి విజయ్ ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. సినిమా ఎప్పుడొచ్చినా సరే రికార్డులు కొల్లగొట్టడం పక్కా అని అంటున్నారు.
కోలీవుడ్ సినిమాలు ఈమధ్య తెలుగులో చెప్పుకోదగ్గ హిట్లు కొట్టట్లేదు. అందుకే తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ కంగువ రైట్స్ మీద పునరాలోచనలో ఉన్నారు. అయితే నిర్మాతల్లో ఒకరైన యువి మేకర్స్ సినిమాను సొంతంగా రిలీజ్ చేసే ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తుంది.
Also Read : Fahad Fazil Aavesham : ఫాఫా ఆవేశం.. తెలుగు రీమేక్ హీరో ఎవరు..?