Vijayakanth Funeral: విజయ్ పై చెప్పు విసిరిన గుర్తు తెలియని వ్యక్తి

డీఎండీకే చైర్మన్ విజయకాంత్ అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. కోయంబత్తూరులోని డీఎండీ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో ఆయన భౌతికకాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

Published By: HashtagU Telugu Desk
Vijayakanth Funeral

Vijayakanth Funeral

Vijayakanth Funeral: డీఎండీకే చైర్మన్ విజయకాంత్ అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. కోయంబత్తూరులోని డీఎండీ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో ఆయన భౌతికకాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. డీఎండీ ప్రధాన కార్యాలయంలో ఉంచిన విజయకాంత్ పార్థివదేహానికి నివాళులు అర్పించేందుకు సినీనటులు, రాజకీయ నేతలు, డీఎండీ కార్యకర్తలు, ప్రజానీకం తరలివచ్చారు. నిన్న రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ప్రముఖ నటుడు విజయ్ స్వయంగా వెళ్లి అశ్రు నివాళులర్పించారు. అనంతరం ప్రేమలత విజయకాంత్‌తో కాసేపు మాట్లాడి వెళ్లిపోయారు.

జనాల మధ్య కారులోకి వెళ్లేందుకు ప్రయత్నించిన నటుడు విజయ్‌పై గుర్తు తెలియని వ్యక్తి చెప్పు విసిరేందుకు ప్రయత్నించాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అయితే సెక్యూరిటీ దాన్ని అడ్డుకున్నాడు. ఈ దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన దళపతి అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ మద్దతుదారులే కాకుండా వివిధ పార్టీలు కూడా ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాయి.

Also Read: CM Revanth Reddy: త్వరలో రేవంత్ చేతుల మీదుగా 1000 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం

  Last Updated: 30 Dec 2023, 06:37 PM IST