Site icon HashtagU Telugu

Thalapathy Vijay Divorce : విడాకులకు సిద్దమైన హీరో విజయ్..?

Hero Vijay Divorce

Hero Vijay Divorce

Thalapathy Vijay Divorce : చిత్రసీమ (Film Industry)లో విడాకులు (Divorce) అనేవి కామన్..షూటింగ్ లలో హీరోయిన్లతో దగ్గర అవ్వడం..ఆ తర్వాత కొంత కాలం ప్రేమాయణం సాగించడం..పెద్దల సమక్షంలో భారీ ఖర్చు పెట్టి పెళ్లి చేసుకోవడం..మూడేళ్లు తిరగకముందే విడాకులు తీసుకోవడం చేస్తున్నారు. ఈ మధ్య అయితే మరి ఎక్కువై పోయింది. ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు వరుసపెట్టి విడాకుల ప్రకటన చేస్తూ అభిమానులకు , సినీ లవర్స్ కు షాక్ ఇస్తున్నారు. తాజాగా జయం రవి (Jayam Ravi Divorce) సైతం తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. తన భర్త తనకు చెప్పకుండానే విడాకులు ప్రకటించాడని రవి భార్య ఆర్తి చెప్పడం గమనార్హం. ఇక ఈ విడాకుల ప్రకటనతో కోలీవుడ్ ప్రకంపనలు రేపుతుండగానే మరో విడాకుల వార్త బయటకు వచ్చింది. ఆ విడాకులు తీసుకోబోయేది ఎవరో కాదు టాప్ హీరో విజయ్ అని కోలీవుడ్ లో ప్రచారం మొదలైంది. ప్రస్తుతం విజయ్ సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి రాజకీయాల్లో బిజీ అయ్యేందుకు డిసైడ్ అయ్యాడు. ఇప్పటికే తన పార్టీ పనుల్లో బిజీగా గడుపుతున్నాడు.

విజయ్, తన భార్య సంగీత (Thalapathy Vijay’s wife, Sangeetha Sornalingam)తో విడిపోవాలని ఫిక్స్ అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారట. కుమారుడుతో కలిసి సంగీత ఒక ఇంట్లో ఉంటుండగా.. విజయ్ (Thalapathy Vijay) ఒక్కడే వేరే ఇంట్లో ఉంటున్నట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. గతంలో ఇలాంటి వార్తలు వచ్చినా.. సంగీత ఏదో ఒక విధంగా ఇవన్నీ రూమర్స్ అని కొట్టేస్తూ వచ్చింది. కానీ, ఈసారి మాత్రం ఆమె నోరు కూడా మెదపడం లేదని టాక్ ఇక దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని, త్వరలో ఈ జంట తమ 28 ఏళ్ళ వివాహ బంధానికి చెక్ పెట్టబోతున్నారని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.

Read Also : Ayushman Health Insurance : సీనియర్ సిటిజన్లకు కేంద్రం తీపి కబురు