Site icon HashtagU Telugu

Thalapathy Vijay : తన కొత్త సినిమాకి విజయ్ అంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడా.. దానితో హనుమాన్ మూవీని..

Thalapathy Vijay Charging Huge Remuneration For H Vinoth Movie

Thalapathy Vijay Charging Huge Remuneration For H Vinoth Movie

Thalapathy Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుత వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ అల్ టైం’ సినిమా చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఇక ఈ సినిమా తరువాత విజయ్ తన నెక్స్ట్ సినిమాని హెచ్ వినోద్ దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయట.

ఇక ఈ సినిమాకి గాను విజయ్ భారీ రెమ్యూనరేషన్ ని ఛార్జ్ చేస్తున్నారట. దాదాపు రూ.250 కోట్ల పారితోషకాన్ని విజయ్ తీసుకుంటున్నట్లు తమిళ్ ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఇది చూసిన తెలుగు ఆడియన్స్.. ఆ రెమ్యూనరేషన్ తో హనుమాన్ సినిమాని ఐదు సార్లు తెరకెక్కించవచ్చు అని కామెంట్స్ చేస్తున్నారు. హనుమాన్ సినిమా కేవలం 40 కోట్లతో తెరకెక్కించిన విషయం తెలిసిందే.

మరి విజయ్ నిజంగానే ఇంతటి రెమ్యూనరేషన్ ని ఛార్జ్ చేస్తున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. కాగా ఈ సినిమాని పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇటీవలే విజయ్ పొలిటికల్ పార్టీ పెట్టీ రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో పొలిటికల్ సబ్జెట్ తో మూవీ అంటే ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను హెచ్ వినోద్ ఎంత వరకు అందుకుంటారో చూడాలి.

కాగా హెచ్ వినోద్, కార్తీతో ‘ఖాకి’, అజిత్‌తో ‘వలిమై’, ‘తెగింపు’ వంటి సినిమాలను డైరెక్ట్ చేసారు. ఈ మూడు సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం ఈ దర్శకుడు కమల్ హాసన్ తో ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించే పనిలో ఉన్నారు.

Also read : Allu Arjun : అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. బర్త్‌డేకి అవేవి లేవంట..