Site icon HashtagU Telugu

Thalapathi Vijay : విజయ్ సినిమాలో మరో స్టార్ హీరోయిన్.. ఎంతమంది కావాలి బాసు..!

Director Shocking Comments on Thalapathi Vijay GOAT Result

Director Shocking Comments on Thalapathi Vijay GOAT Result

దళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న జి.ఓ.ఏ.ట్ గోట్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఐతే ఈ సినిమా గురించి వచ్చే ప్రతి అప్డేట్ దళపతి విజయ్ ఫ్యాన్స్ ని అలరిస్తుంది. గోట్ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో భారీ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఐతే ఈ సినిమాలో హీరోయిన్స్ లిస్ట్ రోజు రోజుకి పెరుగుతుంది. ఇప్పటికే మీనాక్షి చౌదరి లీడ్ హీరోయిన్ అని తెలుస్తున్నా సినిమాలో త్రిష కూడా మరో హీరోయిన్ గా చేస్తుందని తెలుస్తుంది. త్రిష ఆల్రెడీ విజయ్ లేటెస్ట్ మూవీ లియోలో నటించింది.

ఇప్పుడు మళ్లీ గోట్ లో కూడా ఛాన్స్ కొట్టేసింది. విజయ్ త్రిషల క్రేజీ పెయిర్ ని మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తున్నారు మేకర్స్. ఇదిలాఉంటే ఈ సినిమాలో మెనాక్షి, త్రిష కాకుండా మరో హీరోయిన్ ను కూడా తీసుకుంటున్నారట. విజయ్ సినిమాలో శృతి హాసన్ స్పెషల్ సాంగ్ చేయబోతుందని టాక్. అంతేకాదు క్యామియో రోల్ కూడా చేస్తుందట. శృతి హాసన్ (Shruthi Hassan) తో విజయ్ చేసే సాంగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది.

విజయ్ (Thalapathi Vijay) తో నటించాలని శృతి హాసన్ ఎప్పటి నుంచో అనుకుంటుంది. ఐతే ఆ ఛాన్స్ ఇన్నాళ్లకు వచ్చింది. కమల్ కూతురైనా తన కెరీర్ విషయంలో తనదే అంతా అనేట్టు చెప్పుకొచ్చే శృతి హాసన్ ఈమధ్య వచ్చిన ఏ ఛిన్న ఛాన్స్ ని కూడా వదలట్లేదు. తప్పకుండా శృతి హాసన్ విజయ్ గోట్ సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పొచ్చు.

విజయ్ గోట్ సినిమా తెలుగులో భారీ బిజినెస్ చేస్తుంది. ఇక్కడ ఆ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. వెంకట్ ప్రభు ఈ సినిమాతో తిరిగి మళ్లీ తన ట్రాక్ లోకి రావాలని చూస్తున్నారు. మరి సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి.

Also Read : Bigg Boss 8 : బిగ్ బాస్ కోసం కింగ్ సైజ్ రెమ్యునరేషన్..!