TeluguDMF: తెలుగు కంటెంట్ క్రియేటర్‌లు మరియు ఇన్‌ఫ్లుయెన్సర్‌లను ఏకం చేయడానికి తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ (Telugu DMF) ప్రారంభమైంది. వెబ్‌సైట్ రైటర్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు మరియు మీమ్ క్రియేటర్‌లతో సహా విభిన్న డిజిటల్ వర్గాల వారిని ఒకచోట చేర్చి, వారికీ , సహకారాన్ని పెంపొందించడం మరియు అవసరమైన ప్రయోజనాలను తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ అందిస్తుంది.
కంటెంట్ క్రియేటర్‌లు మరియు ఇన్‌ఫ్లుయెన్సర్‌లను ఏకం చేయడంలో మరియు సాధికారత కల్పించడంలో ఫెడరేషన్ ప్రాముఖ్యతను గుర్తించిన పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో తెలుగుడిఎంఎఫ్ వెబ్‌సైట్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకుల చొరవను ప్రశంసించారు చిరు. తెలుగుడిఎంఎఫ్ విజయవంతానికి మెగాస్టార్ చిరంజీవి తన పూర్తి మద్దతు మరియు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఫెడరేషన్ లోగోను, పోస్టర్‌ను ఆవిష్కరించారు. విభిన్న స్వరాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో దాని పాత్రను హైలెట్ చేస్తూ ప్రశంసించారు పొంగులేటి. ఈ సందర్భంగా తెలుగు డిఎమ్‌ఎఫ్‌కి రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
Also Read; CAA : కాసేపట్లో సీఏఏ చట్టం అమలుకు నోటిఫికేషన్.. ప్రధాని మోడీ ప్రసంగం