Site icon HashtagU Telugu

TFC : ఏపీ సర్కార్ కు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి లేఖ

Tfc Cbn

Tfc Cbn

ఏపీలో కూటమి విజయం సాధించడం పట్ల తెలుగు చిత్రసీమ (Telugu Film Industry) ఎంతో సంతోషంగా ఉంది. చిత్రసీమ నుండి పవన్ కళ్యాణ్, బాలకృష్ణ విజయం సాధించడం..పవన్ ఉప ముఖ్యమంత్రి తో పాటు పలు శాఖలకు మంత్రిగా బాధ్యత వహించడం ఎంతో ఆనందాన్ని కలగజేస్తుంది. ముందు నుండి కూడా చిత్రసీమ చంద్రబాబు కు సపోర్ట్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. బాబు సైతం చిత్రసీమ పట్ల మొదటి నుండి గౌరవం ఇస్తూనే వారికీ కావాల్సిన సదుపాయాలని అందజేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు మరోసారి బాబు సీఎం కావడం తో ఆయనకు కలిసేందుకు చలన చిత్ర వాణిజ్య మండలి సభ్యులు అపాయింట్​మెంట్ కోరుతూ లేఖ రాశారు.

ఈ మేరకు ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ ఈ నెల 26న విజయవాడలో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. చాంబర్ అధ్యక్షుడు దిల్​రాజుతో పాటు కార్యదర్శులు దామోదరప్రసాద్, శివప్రసాద్ రావు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేశ్, ఐటీ మంత్రి నారా లోకేశ్​ అపాయింట్​మెంట్ కోరుతూ లేఖ రాశారు.

We’re now on WhatsApp. Click to Join.

మరోపక్క రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేశ్ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. హైదరాబాద్​లోని విశ్వంభర సినిమా సెట్​లోకి వచ్చిన మంత్రి దుర్గేశ్​కు చిరంజీవితోపాటు చిత్ర బృందం సాదర స్వాగతం పలికింది. పర్యాటక, సినిమాటోగ్రఫి మంత్రిగా దుర్గేష్‌ సంపూర్ణ విజయం సాధించాలని చిరంజీవి ఆకాంక్షించారు.

ఇక దుర్గేష్ మాట్లాడుతూ.. మన రాష్ట్రం సినిమాటోగ్రఫీకి అనేక విధాలుగా తోడ్పడిందని, కోనసీమ , కృష్ణా పర్యాటక ప్రాంతాల్లో అనేక షూటింగులు జరిగాయని..గత పాలకులకు చిత్తశుద్ధి ఉంటే కేరళ నుంచి కోనసీమను అభివృద్ధి చేసేవాళ్లని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కోనసీమను అద్భుతంగా అభివృద్ధి చేసి సినిమా షూటింగ్‌లకు ఉపయోగించుకుంటామన్నారు. నిర్మాతలకు ఆహ్వానం పలుకుతున్నామని… ఏపీలో స్టూడియోలు నిర్మాణం చేయటానికి ముందుకు రావాలని మంత్రి కందుల దుర్గేష్ ఆహ్వానించారు. ఏపీ మంచి వనరులున్న రాష్ట్రమని.. అధికార యంత్రాంగంతో కలిసి రాష్ట్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని మంత్రి వెల్లడించారు. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం , అడ్వెంచర్ టూరిజం వంటి వాటిని విస్తృతంగా ప్రోత్సహిస్తామన్నారు.

Read Also : Singareni : సింగ‌రేణి మెడ‌పై కేంద్రం క‌త్తి పెడితే..కాంగ్రెస్ సాన‌బెడుతోంది – కేటీఆర్