Samantha-Chaitanya: మరాఠీ ‘మజిలీ’పై తెలుగు ఫ్యాన్స్ ట్రోలింగ్.. ఎందుకో తెలుసా!

సమంత, నాగచైతన్య విడిపోయినా.. వాళ్ల కెమిస్ట్రీ మాత్రం అదుర్స్.. ఎందుకో తెలుసా?

Published By: HashtagU Telugu Desk
Majili, Samantha and chaitanya

Majili

ఇండియాలో టాలీవుడ్ (Tollywood)హవా కొనసాగుతోంది. ఇటీవల రిలీజ్ అయిన సినిమాలు బాలీవుడ్ లో సైతం ప్రభావం చూపాయి. అందుకే బాలీవుడ్ టాలీవుడ్ సినిమాలు, కథలపై లుక్ వేస్తోంది. తెలుగు సినిమాలు ఇప్పుడు ఇతర భాషల్లో ముఖ్యంగా హిందీలో రీమేక్ అవుతున్నాయి. సల్మాన్ ఖాన్, రితీష్ దేశ్‌ముఖ్, జెనీలియా ప్రధాన పాత్రల్లో నటించిన ‘వేద్’ అనే మరాఠీ చిత్రం గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది.

సమంత, నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు బ్లాక్ బస్టర్ మజిలీకి ఇది రీమేక్. ఇటీవల విడుదల చేసిన వేద్ ప్రమోషనల్ వీడియోలోని వీడియో క్లిప్‌ను నెటిజన్లు ఇప్పుడు షేర్ చేస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో సహా వీడియోకు సంబంధించిన ప్రతి ఒక్కటీ కృత్రిమంగా (పేలవంగా) ఉందని తెలుగు (Tollywood) నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

అయితే జెనీలియా రితీష్‌ పాదాలను తాకడం చూస్తుంటాం. ఒరిజినల్‌ మజిలీతో పోల్చినప్పుడు ఏమాత్రం బాగా లేదు. కానీ సమంత మాత్రం ఎమోషన్స్ ను బాగా పండించింది. మజిలీలో చై, సామ్‌లు (Samantha and Chaitanya) అద్భుతంగా నటించారని అంటున్నారు. విడుదల కాబోతున్న వేద్ మూవీలో మాత్రం కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదని, ఎమోషన్స్ సీన్స్ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేదని అంటున్నారు తెలుగు ఫ్యాన్స్.  డిసెంబర్ 30న ఈ మూవీ విడుదల కానుంది. ఈ చిత్రానికి రితీష్‌ స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read: Raashi Khanna Pics: అందాల రాశి.. ఎద అందాలు ఆరబోసి!

  Last Updated: 07 Dec 2022, 04:26 PM IST