Site icon HashtagU Telugu

Vyooham : వర్మ ‘వ్యూహం’ నికి షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు

Telangana High Court Shock

Telangana High Court Shock

వర్మ (RGV) తెరకెక్కించిన ‘వ్యూహం’ (Vyooham ) మూవీ కి తెలంగాణ హైకోర్టు (Telangana High Court) షాక్ ఇచ్చింది. ‘వ్యూహం’ సినిమా సెన్సార్ సర్టిఫికెట్‌ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. చిత్రసీమలో ఒకప్పుడు వర్మ అంటే వేరు..ఇప్పుడు వర్మ అంటే వేరు. గతంలో ఆయన సినిమా వస్తుందంటే సినీ ప్రముఖులు సైతం ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే అనేవారు..కానీ ఇప్పుడు వర్మ నుండి సినిమా అంటే వామ్మో వద్దురా బాబో అనే స్థాయికి దిగజారిపోయాడు. నిత్యం వివాదాలతో ఇండస్ట్రీ కి చెడ్డ అనే పేరు తెచ్చుకున్నాడు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం ఈయన ‘వ్యూహం’ సినిమాను తెరకెక్కించినప్పటికీ కోర్ట్ లలో నడుస్తూ రిలీజ్ కు నోచుకోలేకపోతుంది. వైస్సార్ (YSR) మరణం తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను ఈ చిత్రంలో చూపించబోతున్నారు. దీంతో ఈ మూవీ రిలీజ్ ఆపాలంటూ కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసారు. తమ నాయకులు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులపై అ వాస్తవ సంఘటనలు చిత్రీకరించి.. బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, అభూత కల్పనలతో వర్మ వ్యూహం సినిమాను తెరకెక్కించారంటూ కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేయడం తో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఇప్పటికే ఆ సినిమాకు ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేసింది. సినిమాను మరోసారి రివ్యూ చేయాలని సెన్సార్ బోర్డును ఆదేశించింది. మూడు వారాల్లోగా రివ్యూ కమిటీ నివేదికను హైకోర్టుకు సబ్మిట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరి ఇప్పుడు వర్మ ఏంచేయబోతారో చూడాలి.

Read Also : Ayodhya – Bala Ramudu : బాల రాముడు ఎలాంటి అల్లరి, చిలిపి పనులు చేసాడో తెలుసా..?