హనుమాన్ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు యువ హీరో తేజ సజ్జ. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. హనుమాన్ తో హిట్ పడగానే తేజ క్రేజ్ పెరిగిపోయింది. ఆ తర్వాత కూడా వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నాడు. తేజ సజ్జ (Teja Sajja) నెక్స్ట్ సినిమా మిరాయ్ వస్తుంది. కార్తీక్ (Karthik) ఘట్టమనేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.
మిరాయ్ (Mirai) టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెంచారు. ఏప్రిల్ 18 2025 లో ఈ సినిమా రిలీజ్ లాక్ చేశారు. ఐతే హనుమాన్ హిట్ అవ్వడంతో మిరాయ్ మీద భారీ హైప్ ఏర్పడింది. అందులోనూ టీజర్ కూడా సంథింగ్ స్పెషల్ అనిపించింది. ఈ సినిమాలో మంచు మనోజ్ (Manchu Mano) విలన్ గా నటించడం సినిమాకు మరింత ప్లస్ అవుతుంది.
మిరాయ్ సినిమా ఆడియో రైట్స్..
ఐతే మిరాయ్ సినిమా ఆడియో రైట్స్ ను ప్రముఖ మ్యూజిక్ కంపెనీ భారీ ధరకు పొందినట్టు తెలుస్తుంది. మిరాయ్ ఆడియో రైట్స్ ని రెండున్నర కోట్లకు ఒక ఆడియో కంపెనీ కొనేసిందట. సినిమా థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగానే జరుగుతుందని టాక్.
మిరాయ్ సినిమా గ్లింప్స్ తోనే సినిమాలో చాలా విషయం ఉన్నట్టు చూపించారు. తేజ సజ్జ మరో ఎక్స్ పెరిమెంట్ తో ఈ సినిమా చేస్తున్నాడు. ఈగల్ తో నిరాశపరచినా సరే కార్తీక్ ఈసారి మిరాయ్ తో అదరగొట్టాలని చూస్తున్నాడు.
Also Read : Mrunal Thakur : మృణాల్ ని పక్కన పెడుతున్నారెందుకు.. ఒక్క ఫ్లాప్ తో ఫేట్ మారిపోయిందే..!