Teja Sajja : తేజ కొత్త సినిమాలో రితికా నాయక్ హీరోయిన్.. దర్శకుడు ఎవరంటే..!

తేజ కొత్త సినిమాలో రితికా నాయక్ ని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారట. ఇంతకీ దర్శకుడు ఎవరో తెలుసా..?

Published By: HashtagU Telugu Desk
Teja Sajja Ritika Nayak Are Went To Tie Up In Their New Project

Teja Sajja Ritika Nayak Are Went To Tie Up In Their New Project

Teja Sajja : టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జ రీసెంట్ గా ‘హనుమాన్’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. పాన్ ఇండియా వైడ్ ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో.. ఈ హీరో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ఆడియన్స్ లో మంచి ఆసక్తి కనిపిస్తుంది.

అయితే ఈ యువ హీరో ఇప్పటి వరకు తన కొత్త సినిమాని అనౌన్స్ చేయలేదు. హనుమాన్ కి సీక్వెల్ గా తెరకెక్కే ‘జై హనుమాన్’ అయితే లైనప్ లో ఉంది. కానీ ఈ సినిమాలో తేజ సజ్జ మెయిన్ హీరో కాదు. మరి తేజ సజ్జ మెయిన్ హీరోగా తెరకెక్కే నెక్స్ట్ మూవీ ఏంటి..? ఆ సినిమాని ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు..?

తేజ సజ్జ తన నెక్స్ట్ మూవీని కార్తీక్ ఘట్టమనేనితో ప్లాన్ చేసారు. సినిమాటోగ్రాఫర్ గా పలు సూపర్ హిట్ మూవీస్ కి పని చేసిన కార్తీక్.. సూర్య వెర్సస్ సూర్య, ఈగల్ సినిమాలు చేసారు. ఈ రెండు సినిమాలు సరికొత్త స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఈగల్ సినిమాని అయితే హాలీవుడ్ టేకింగ్ తో చిత్రీకరించి వావ్ అనిపించారు. ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడితోనే తేజ తన కొత్త సినిమాని చేయబోతున్నారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమాలో తేజకి జోడిగా రితికా నాయక్ ని ఎంపిక చేసుకున్నారట. ఇక ఈ వార్త చూసిన ఆడియన్స్.. తేజ అండ్ రితికా జోడి చూడడానికి చాలా బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా ఎలాంటి నేపథ్యంతో రాబోతుందో అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గానే తీసుకు రాబోతున్నారట.

Also read : Kalki 2898 AD : కల్కి రిలీజ్ డేట్‌పై కొత్త వార్త.. అయితే ఇండియన్ 2 కూడా..

  Last Updated: 04 Apr 2024, 01:08 PM IST