The Vaccine War – Teaser : “ది వ్యాక్సిన్ వార్” టీజర్ చూడండి.. వెరీ ఇంట్రెస్టింగ్ !

The Vaccine War - Teaser :"ది కశ్మీర్ ఫైల్స్" మూవీతో సంచలనం సృష్టించిన దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి మరో ఫిల్మ్ ను తీసుకొస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
The Vaccine War Teaser

The Vaccine War Teaser

The Vaccine War – Teaser :“ది కశ్మీర్ ఫైల్స్” మూవీతో సంచలనం సృష్టించిన దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి మరో ఫిల్మ్ ను తీసుకొస్తున్నారు. “ది వ్యాక్సిన్ వార్” టైటిల్ తో సెప్టెంబర్‌‌ 28న రిలీజ్ కానున్న ఈ మూవీకి సంబంధించిన టీజర్ ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదల చేశారు. ఈ టీజర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. టీజర్ లోని సీన్స్ ప్రకారం  ..  కరోనా సమయంలో  ల్యాబ్‌లో  కొవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్ పై ఈ మూవీ కథ ఉంటుంది.  పల్లవి జోషి ఈ సినిమాలో సైంటిస్ట్ పాత్రలో కనిపించనున్నారు. నానా పటేకర్ పాత్రను టీజర్ లో హైలైట్ చేశారు.   కశ్మీర్ ఫైల్స్‌ లో కీలక పాత్ర పోషించిన అనుపమ్ ఖేర్, సప్తమి గౌడ, దివ్య సేథ్ ఇతర ముఖ్య  పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, పంజాబీ, భోజ్‌పురి, బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళం, కన్నడ, ఉర్దూ, అస్సామీలతో సహా 10కిపైగా భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల(The Vaccine War – Teaser)  కానుంది.

Also read : WHO Alert: బాంబు పేల్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, కొత్త వేరియంట్ పై హెచ్చరిక!

“ది వ్యాక్సిన్ వార్” వర్సెస్ ‘సలార్‌’ 

“ది వ్యాక్సిన్ వార్” సెప్టెంబర్‌‌ 28న రిలీజ్ కానుండగా.. అదే రోజున రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్‌’ ఫస్ట్ పార్ట్ కూడా రిలీజ్ కాబోతోంది. గతేడాది కూడా  ప్రభాస్‌ నటించిన ‘రాధేశ్యామ్‌’ సినిమా రిలీజ్ టైంలోనే ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రాన్ని వివేక్ రంజన్ అగ్నిహోత్రి విడుదల చేశారు.  అప్పట్లో  ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈసారి “ది వ్యాక్సిన్ వార్” కు ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.

  Last Updated: 16 Aug 2023, 02:15 PM IST