Site icon HashtagU Telugu

Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’ టీజర్ వచ్చేసింది.. ప‌వ‌ర్ ప్యాక్డ్‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

Hari Hara Veera Mallu

Harihara Veeramallu

Hari Hara Veera Mallu: క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 27వ చిత్రం హరి హర వీర మల్లు. ఈ మూవీ ప్రకటించి నాలుగేళ్లు పూర్తయింది. ఈ మూవీతో పవన్ కళ్యాణ్ పాన్-ఇండియన్ స్టార్‌గా ఎద‌గాల‌ని చూస్తున్నాడు. ఇప్ప‌టికే ప‌లువురు హీరోలు పాన్ ఇండియా మూవీల‌తో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. ప్రస్తుతం చిత్ర షూటింగ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ బిజీ షెడ్యూల్ వ‌ల ఆగిపోయింది. కానీ అభిమానులను ఆనందపరిచేందుకు మేకర్స్ అధికారికంగా హరి హర వీర మల్లు పార్ట్ 1: కత్తి వర్సెస్ స్పిరిట్ అనే టైటిల్‌తో సినిమా మొదటి భాగం టీజర్‌ (Hari Hara Veera Mallu)ను కొద్దిసేప‌టి క్రితం రిలీజ్ చేశారు.

టీజర్ హై-క్వాలిటీ విజువల్స్‌తో ఉంది. ఈ మూవీలో బాబీ డియోల్‌ను మొఘల్ చక్రవర్తిగా తన రాజవంశంలోని ప్రజలను దోపిడీ చేసే క్యారెక్ట‌ర్‌లో న‌టిస్తున్నాడు. శ‌త్రువుల‌కు వ్యతిరేకంగా తన కత్తి-పోరాట నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ లెజెండరీ వీరోచిత నాయ‌కుడిగా పవన్ కళ్యాణ్ ఈ మూవీలో క‌నిపించ‌నున్నాడు. టీజర్ ప్రేక్షకులకు ఉత్తేజకరమైన యాక్షన్-ప్యాక్డ్ అనుభవాన్ని ఇస్తుంది. ఈ సంవత్సరం చివర్లో ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి చిత్ర‌బృందం ప్లాన్ చేస్తోంది. ఈ మూవీలో ప‌వ‌న్ క‌ల్యాణ్ లుక్ ప‌వ‌ర్ ప్యాక్డ్‌గా ఉంది. టీజ‌ర్ అంచ‌నాల‌కు మించి ఉండ‌టంతో ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు. ఈ మూవీలో ప‌వ‌న్ దొంగ పాత్ర‌లో క‌నిపిస్తార‌ని టాక్‌.

Also Read: NTR – Prabhas : సలార్ 2ని పక్కన పెట్టేసి.. ఎన్టీఆర్ సినిమా స్టార్ట్ చేయబోతున్న ప్రశాంత్ నీల్..

క్రిష్‌తో పాటు, జయకృష్ణ ఈ చిత్రానికి సహ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ మెగా సూర్య ప్రొడక్షన్ వెంచర్‌లో ఎఏం ర‌త్నం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ MM కీరవాణి సంగీతం, జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్‌పై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. అయితే ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బిజీగా ఉన్నారు. ఎల‌క్ష‌న్స్ అనంత‌రం ఆయ‌న వ‌రుస‌గా సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంటార‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ప‌వ‌న్ చేతిలో ఓజీ, హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు చిత్రాలు ఉన్నాయి. ఈ సినిమాల త‌ర్వాత హ‌రీశ్ శంక‌ర్ తో ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమాను కంప్లీట్ చేయ‌నున్నారు.

We’re now on WhatsApp : Click to Join