Site icon HashtagU Telugu

Ram Charan Emotion: ఆ దృశ్యాన్ని తెరపై చూసినప్పుడు కన్నీళ్లు ఆగలేదు: రామ్ చరణ్

Ram Charan

Ram Charan

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సైరా మూవీలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా నటించి విమర్శకుల ప్రశంసలు పొందిన విషయం తెలిసిందే. దాదాపు 280 కోట్లతో తెరకెక్కిన సినిమాలో చిరంజీవి గొప్ప యోధుడి పాత్రలో ఆకట్టుకున్నాడు. ఈ మూవీతో మెగా స్టార్ చిరంజీవి వారసుడు రామ్ చరణ్ (Ram Charan) నిర్మాతగా నిలిచాడు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించాడు. అయితే ఇటీవల ఆస్కార్ వేడుకల్లో సందడి చేసిన ఈ మెగాహీరో తన సినిమా విశేషాలను షేర్ చేసుకుంటూ మరోసారి సైరా సినిమా గురించి మాట్లాడారు.

‘‘సైరా పతాక సన్నివేశాల్లో నాన్నగారిని ఉరి తీస్తారు. ఆ సీన్ ను తెరపై చూసినప్పుడు కన్నీళ్లు ఆగలేదు (Ram Charan). తల తెగి ఉన్న ఆయన్ని చూడలేకపోయా. నిజానికి ఆ సీన్ ఎలా చేయాలో నిర్ణయించుకోవడానికి మాకు రెండు నెలల సమయం పట్టింది’’ అని రామ్ చరణ్ ఎమోషన్ అయ్యారు. అలాంటి సీన్స్ లో నాన్నను చూడలేనని ఆయన  (Ram Charan) అన్నారు.

ఇక క్లైమాక్స్ లో నరసింహారెడ్డిని ఉరితీసే సన్నివేశంపై సురేందర్ రెడ్డి చాలా క్లారిటీతోనే ఉన్నారు. మెగాస్టార్ అలాంటి సన్నివేశంలో కనిపిస్తే అభిమానులు నిరాశ చెందారా అని ప్రశ్నకు బదులిస్తూ.. క్లైమాక్స్ సన్నివేశం భాదించేలా ఉండదు.. మెగా అభిమానులు రొమ్ము విరుచుకుని థియేటర్స్ నుంచి బయటకు వెళ్లేలా తెరకెక్కించినట్లు సురేందర్ రెడ్డి గతంలో చాలాసార్లు చెప్పారు.

Also Read: Keerthy Suresh: కల్లు తాగిన కీర్తి సురేశ్.. షాకైన ఫ్యాన్స్