Site icon HashtagU Telugu

Manchu Family Fight : మంచు గొడవల మధ్యకు తమ్మారెడ్డి

Manoj Vishnu

Manoj Vishnu

తెలుగు సినీ పరిశ్రమలో సుదీర్ఘ చరిత్ర కలిగిన కుటుంబంగా పేరు తెచ్చుకున్న మంచు ఫ్యామిలీ(Manchu Family)లో ఇటీవల వెలుగు చూసిన విభేదాలు అందరినీ కలిచివేశాయి. మంచు విష్ణు మరియు మంచు మనోజ్ (Vishnu vs Manoj) మధ్య చిన్నగా మొదలైన విబేధం, వివాదాలుగా మారి పరస్పరం ఆరోపణలు, పోలీసు కేసులు దాకా వెళ్లింది. అభిమానులు, సినీ ప్రేక్షకులు వీరి మధ్య సద్ది జరిగిపోవాలని ఆశపడుతున్నా, ఈ వివాదం ఎప్పుడు ముగుస్తుందో అన్న అనుమానమే కొనసాగుతోంది.

Tollywood : టాలీవుడ్ పెద్దలు కావాలని కష్టాలు కొనితెచ్చుకుంటున్నారా..?

ఈ తరుణంలో టాలీవుడ్ సీనియర్ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy Bharadwaj) ఈ గొడవను పరిష్కరించేందుకు ముందుకొచ్చారు. “కన్నప్ప” సినిమా ప్రమోషన్ సమయంలో మంచు విష్ణుతో కలిసి పాల్గొన్న ఇంటర్వ్యూలో, తమ్మారెడ్డి మంచు కుటుంబంలో తలెత్తిన ఈ వివాదంపై స్పందించారు. ఈ గొడవలు తనను తీవ్రంగా కలిచివేశాయనీ, త్వరలో ఈ సమస్యకు శాంతియుత పరిష్కారం అవసరమని అభిప్రాయపడ్డారు. కన్నప్ప సినిమా పూర్తైన తరువాత మంచు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కూర్చుని సమస్యపై చర్చించాలని, అవసరమైతే తాను మధ్యవర్తిగా వ్యవహరించేందుకు సిద్ధమని చెప్పారు.

తమ్మారెడ్డి మధ్యవర్తిత్వంపై మంచు విష్ణు కూడా సానుకూలంగా స్పందించారు. ఆయన చెప్పే మాటలను గౌరవిస్తానని, ఆయన సూచనలను పాటిస్తానని హామీ ఇచ్చారు. కనుక “కన్నప్ప” విడుదల తర్వాత మంచు కుటుంబం మధ్య తమ్మారెడ్డి సలహాల‌తో కలిసిమెలిసి మాట్లాడుకుని ఈ వివాదానికి ముగింపు పలుకుతుందా అనే ఆశ సినీ సర్కిల్స్ లోనూ, అభిమానుల్లోనూ నెలకొంది.