సంక్రాంతి అంటే సినిమాల పండగ కూడా. ఫ్యామిలీలు అంతా సంక్రాంతి పండగని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకొని సినిమాలకు కూడా వెళ్తారు. అందుకే సంక్రాంతికి తమ సినిమాలని రిలీజ్ చేయాలని అంతా భావిస్తుంటారు. ఈ సారి తెలుగులో సంక్రాంతికి భారీ క్లాష్ వచ్చిన సంగతి తెలిసిందే. నాలుగు సినిమాలు తెలుగులో ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి.
మహేష్ బాబు గుంటూరు కారం(Mahesh Babu Guntur Kaaram) సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినా ఇప్పటికే 175 కోట్లకు పైగా కలెక్ట్ చేసి దూసుకుపోతుంది. ఇక హనుమాన్(Hanuman) సినిమా భారీ బ్లాక్ బస్టర్ కొట్టి 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దుమ్ము దులిపేస్తుంది. నాగార్జున నా సామిరంగ(Naa Saami Ranga) సినిమా కూడా మంచి విజయం సాధించి ఇప్పటికే 25 కోట్ల కలెక్షన్స్ ని తెచ్చుకుంది. సైంధవ్ సినిమా మాత్రం యావరేజ్ గా నిలిచింది. ఈ సినిమా కలెక్షన్స్ ఇంకా ప్రకటించకపోయినా 15 కోట్ల పై వరకు కలెక్షన్స్ తెచ్చుకున్నట్టు సమాచారం.
ఇక తమిళ్ సినిమాలు ఈసారి తెలుగులో డబ్బింగ్ రిలీజ్ అవ్వలేదు. తెలుగులోనే నాలుగు సినిమాలు ఉండటంతో తమిళ్ సినిమాలకు థియేటర్స్ దొరకట్లేదని తెలుగు రిలీజ్ ఆపుకున్నాయి. తమిళ్ లో ఈసారి సంక్రాంతికి అయలాన్(Ayalaan), కెప్టెన్ మిల్లర్(Captain Miller), మిషన్ చాప్టర్ 1 సినిమాలు వచ్చాయి. ఈ మూడు మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి.
శివ కార్తికేయన్ అయలాన్ సినిమా ఇప్పటికే 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి దూసుకెళ్లిపోతుంది. ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమా దాదాపు 60 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది ఇప్పటివరకు. ఇక అరుణ్ విజయ్ మిషన్ చాప్టర్ 1 సినిమా దాదాపు 10 కోట్లు కలెక్ట్ చేసిందని సమాచారం. ఇక వీటిల్లో అయలాన్, కెప్టెన్ మిల్లర్ త్వరలోనే తెలుగులో రిలీజ్ కానున్నాయి.
Also Read : Hanu Man Affect: హనుమాన్ సినిమా ఎఫెక్ట్: హీరో తేజ కొత్త చిత్రం