Tamannah డైరెక్టర్ గానే కాదు నిర్మాతగా కూడా తన టాలెంట్ చూపిస్తున్న సంపత్ నంది తన నిర్మాణంలో తెరకెక్కిన ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకు సీక్వెల్ ప్రకటించాడు. ఆహాలో రిలీజైన ఓదెల రైల్వే స్టేషన్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆ సినిమాకు సీక్వెల్ గా ఓదెల 2 పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ సినింగా వస్తున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా లీడ్ రోల్ లో నటిస్తుంది.
అంతకుముందు సంపత్ నంది డైరెక్ట్ చేసిన రచ్చ, బెంగాల్ టైగర్, సీటీమార్ సినిమాల్లో నటించిన తమన్నా ఆ డైరెక్టర్ సినిమాలో ఆమె పక్కా అనేలా సెంటిమెంట్ ఏర్పరచుకుంది. ఇక ఇప్పుడు అతను నిర్మిస్తున్న సినిమాలో కూడా ఛాన్స్ అందుకుంది తమన్నా. ఓదెల 2 సినిమాను అశోక్ తేజ డైరెక్ట్ చేస్తుండగా ఈ సినిమా కాశిలో ప్రారంభించారు.
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేసే ప్లాన్ లో భాగంగా తమన్నాని ఈ సినిమాలో లీడ్ హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో తమన్నా నాగ సాధు పాత్రలో కనిపించనుంది. తమన్నాకి కూడా ఇది కెరీర్ లో సరికొత్త పాత్ర అని చెప్పొచ్చు. తమన్నా రాకతో ఓదెల 2 పై సూపర్ బజ్ ఏర్పడింది. మరి ఈ ఛాలెంజింగ్ రోల్ లో తమన్నా ఎలా ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.
Also Read : Bollywood Ramayan : బాలీవుడ్ రామాయణం ముహూర్తం ఫిక్స్..!