Site icon HashtagU Telugu

Tamannah : 19 ఏళ్ల కెరీర్ లో అతనిలాంటి వాడిని చూడలేదు..!

Tamannah

Tamannah

Tamannah డైరెక్టర్ గానే కాదు నిర్మాతగా కూడా సంపత్ నంది తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. మధు క్రియేషన్స్ బ్యానర్ లో సంపత్ నంది నిర్మాతగా తెరకెక్కిన ఓదెల రైల్వేస్టేషన్ సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజై సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా ఓదెల 2 తెరకెక్కిస్తున్నారు. ఓదెల 2 పాన్ ఇండియా రిలీజ్ లో భాగంగా తమన్నాని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు.

మహా శివరాత్రి సందర్భంగా ఓదెల 2 నుంచి తమన్నా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చింది. దానికి అందరికీ సంపత్ నంది థాంక్స్ చెబుతూ ఒక ప్రకటన చేశాడు. దానికి తమన్న రెస్పాన్స్ అయ్యింది. సినిమా అనేది అందరి సహకారంతోనే జరుగుతుందని తాను నమ్ముతా.. ఒక వ్యక్తి ఆలోచనతో మొదలైనప్పటికీ అతనికి ఒక టీం తోడై మంచి ప్రాజెక్ట్ చేస్తారు. ఈ విషయాన్ని సంపత్ నంది బాగా అర్ధం చేసుకున్నారు.

19 ఏళ్ల కెరీర్ లో అతని లాంటి వాడిని చూడలేదు. చిన్నదైనా పెద్దదైనా సరే ప్రతి ఒక్కరు సహకారాన్ని ప్రశంసించడం అతని స్పెషాలిటీ. ఇక ఓదెల 2 పోస్టర్ ప్రతి ఒక్కరి కృషి వల్ల అది అలా వచ్చిందని.. వారందరితో కలిసి సెట్ లో ఉండటానికి తాను ఆసక్తిగా ఉన్నానని అన్నారు. అశోక్ తేజ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఓదెల 2 ఫస్ట్ షెడ్యూల్ వారణాసిలో మొదలైంది. సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై భారీ హైప్ తెచ్చిపెట్టింది.

Also Read : Viswambhara : విశ్వంభర.. త్రిష డబుల్ ధమాకా..!