ఈ టాలీవుడ్ హీరోయిన్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమన్నా నటించిన ‘డూ యూ వన్నా పార్టనర్’ విడుదలయ్యింది. ఇందులో ఆమెతో పాటు డయానా పెంటీ కూడా ప్రధాన పాత్రలో నటించింది.

Published By: HashtagU Telugu Desk
Tamannaah

Tamannaah

Tamannaah: సౌత్ సినిమాల నుండి బాలీవుడ్ వరకు తమన్నా భాటియా తన నటనతో, డ్యాన్స్‌తో ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. నటనలో అయినా, డ్యాన్స్‌లో అయినా తనేంటో నిరూపించుకున్న ఈ ‘మిల్కీ బ్యూటీ’ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఎన్నో అవార్డులను అందుకుంది. ఆర్యన్ ఖాన్ డెబ్యూ వెబ్ సిరీస్ ‘స్టార్‌డమ్’లోని ‘గఫూర్’ పాటతో మెప్పించినా లేదా ‘స్త్రీ 2’ లోని ‘ఆజ్ కీ రాత్’ పాటతో కుదిపేసినా ఆమె డ్యాన్స్ స్టెప్పులు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయి. మరి ఇంతటి క్రేజ్ ఉన్న తమన్నా లైఫ్ స్టైల్, ఆమె ఆస్తుల విలువ ఎంతో తెలుసుకుందాం.

నటిగా సినిమా ప్రయాణం

తమన్నా ఇప్పటివరకు సుమారు 89 కంటే ఎక్కువ సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసింది. తొలి సినిమా 2005లో హిందీ చిత్రం ‘చాంద్ సా రోషన్ చెహరా’తో కెరీర్ ప్రారంభించింది. అదే ఏడాది ‘శ్రీ’ సినిమాతో తెలుగులోకి, 2006లో ‘కేడీ’ సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టింది. 2015లో వచ్చిన ‘బాహుబలి’ సినిమా తమన్నా కెరీర్‌ను మలుపు తిప్పింది. ప్రభాస్ నటించిన ఈ పాన్-ఇండియా సినిమాతో ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది.

Also Read: టీ20 జట్టు నుంచి శుభ్‌మన్ గిల్ అవుట్.. గౌతమ్ గంభీర్ మౌనం!

తమన్నా నెట్ వర్త్ (ఆస్తుల విలువ)

ఈ టైమ్స్ నివేదిక ప్రకారం.. తమన్నా నికర ఆస్తుల విలువ సుమారు రూ. 120 కోట్లు. ముంబైలో ఆమెకు 3 విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లు ఉన్నాయి. లగ్జరీ కార్ల విషయానికి వస్తే ఆమె వద్ద ఖరీదైన కార్ల కలెక్షన్ ఉంది.

ఐటమ్ సాంగ్స్‌తో సంచలనం

కేవలం సినిమాలే కాకుండా స్పెషల్ సాంగ్స్ (ఐటమ్ సాంగ్స్) చేయడంలో కూడా తమన్నా నెంబర్ వన్ అనిపించుకుంటోంది. ఆమె ఇటీవలి హిట్ సాంగ్స్ ఇవే.

  • నషా (రెడ్ 2)
  • తబాహి (బాద్షా ఆల్బమ్ సాంగ్)
  • ఆజ్ కీ రాత్ (స్త్రీ 2)
  • గఫూర్ (బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్)

ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమన్నా నటించిన ‘డూ యూ వన్నా పార్టనర్’ విడుదలయ్యింది. ఇందులో ఆమెతో పాటు డయానా పెంటీ కూడా ప్రధాన పాత్రలో నటించింది.

త‌మ‌న్నా కార్ల క‌లెక్ష‌న్‌

  • బిఎమ్‌డబ్ల్యూ (BMW 320i)- రూ. 43.50 లక్షలు
  • మెర్సిడెస్-బెంజ్ GLE- రూ. 1.02 కోట్లు
  • మిత్సుబిషి పజెరో స్పోర్ట్- రూ. 29.96 లక్షలు
  • ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్- రూ. 75.59 లక్షలు
  Last Updated: 21 Dec 2025, 11:16 AM IST